Big Stories

Prithviraj Sukumaran: బాలకృష్ణతో బ్రో డాడీ.. పక్కా మలయాళ సినిమాలా తీస్తా..?

- Advertisement -

Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సలార్ సినిమాతో ఈ హీరో .. టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వరదరాజమన్నార్ గా పృథ్వీరాజ్ నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నటుడు, దర్శకుడు, నిర్మాత ఇలా మల్టీట్యాలెంటె ఉన్న ఈ హీరో ప్రస్తుతం ఆడు జీవితం అనే ప్రయోగాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

- Advertisement -

బ్లేస్సి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 28 న అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన పృథ్వీరాజ్.. మలయాళం, తమిళ్, తెలుగు అనే తేడా లేకుండా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు.

తాజాగా తెలుగులో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన పృథ్వీరాజ్.. టాలీవుడ్ హీరోలను డైరెక్ట్ చేసే ఉద్దేశ్యం ఉందని చెప్పుకొచ్చాడు. ” టాలీవుడ్ లో ఏ హీరోలకు దర్శకత్వం చేయాలని మీరు ఆశపడుతున్నారు” అన్న ప్రశ్నకు పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. ” ప్రభాస్.. తను నాకు మంచి స్నేహితుడు. ఇక ప్రభాస్ తరువాత బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేయాలనీ ఉంది. ఈ మధ్యనే నేను కూడా అనుకున్నాను. ఆయన కోసం ఒక మంచి కథను సిద్ధం చేయాలనీ. అది కూడా పక్కా  మలయాళ కమర్షియల్ సినిమా. చాలా యూనిక్ గా, రియల్ క్యారెక్టర్ లా ఉండాలి.. ఆయన్ను  అలా బిగ్ స్కేల్ ఉన్న కమర్షియల్ సినిమాలో చూడడం నాకు చాలా ఇష్టం” అనగానే యాంకర్ బ్రోడాడీ లానా అని చెప్పుకురాగా.. ” హా అది కూడా మంచి కథనే.. అలాంటి సినిమా చేస్తాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అన్ని కుదిరితే.. బాలకృష్ణను పృథ్వీరాజ్ డైరెక్ట్ చేస్తాడు అని చెప్పొచ్చు. మరి ఆ రోజు త్వరగా వస్తుందేమో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News