Encounter: జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు మరణించారు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పౌరులు కూడా గాయపడ్డారు.
కొకెర్నాగ్ ఏరియాలో అహ్మలాన్ గగర్‌మందులో కొందరు ముష్కరులు తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ఏరియా కార్డన్ ఆఫ్ చేయాలని నిర్ణయించుకున్నారు. జమ్ము కశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడానికి లొకేషన్‌కు వెళ్లాయి. అక్కడ కార్డన్ సెర్చ్ చేస్తుండగా కొందరు ఉగ్రవాదులు కాల్పులు మొదలు పెట్టారు. ప్రాణ రక్షణ కోసం భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి.
Also Read: Chandrababu: టీ టీడీపీ అధ్యక్ష ఎన్నికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించారు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల వల్ల ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఓ సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది.