Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేసింది.. గత ఏడాది బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ అందుకున్న ప్రభాస్ కల్కి మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఆమె నటనకు తెలుగు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రభాస్ హీరోయిన్ అంటూ ఆమెకు సంబందించిన ఫోటోల ను, పోస్టులను సోషల్ మీడియా లో తెగ వైరల్ చేస్తున్నారు. దీపికా రీసెంట్ గా ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత పెద్దగా బయటకు రాలేదు. ఇంకా సినిమాలు కూడా చేస్తున్నట్లు లేదు. కానీ తాజాగా ఆమె భర్త తో ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆమె వేసుకున్న డ్రెస్ వెరైటీగా ఉందని ఆ డ్రెస్ కాస్ట్ ఎంతో అని గూగుల్ లో తెగ వెతుకుతున్నారు. మరి ఆ డ్రెస్ ఖరీదు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ జంటగా మరోసారి ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. దీపికా పదుకొణె , రణవీర్ సింగ్ ఈ స్టైల్లో కనిపించడం తో అందరి చూపు వీరిపై పడింది… అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించడం ఈ జంటను ఫోటోలు తీసేందుకు అందరు కెమెరాల్లో బందించారు.. న్యూ లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. డ్రెస్సింగ్ స్టైల్లో వీళ్లలా మరెవరూ ఉండరని మరోసారి రుజువు చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవ్వడంతో దీపికా డ్రెస్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది.. దీపిక పదుకొనే వేసుకునే డ్రెస్సు ఏ బ్రాండ్, కాస్ట్ గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు..
దీపిక వేసుకున్న డ్రెస్ లీ మిల్ బ్రాండ్ కి చెందిన సకైయోఫీషియల్ పాప్లిన్ స్లిట్ షర్ట్ వేసుకుంది. దీని ధర ఎంతంటే అక్షరాల రూ.79,100. ఈ లైనింగ్ షర్ట్ కు కాలర్, ఫ్రీ సైజ్ స్టిట్టించ్ కరెక్ట్ గా సెట్ అయింది. ఆమె దానిని సిటిజన్స్ ఆఫ్ హ్యుమానిటీతో జత చేసింది.. దాని ధర కూడా ఎక్కువే.. అక్షరాల రూ. 39 వేలు.. వెడల్పాటి కాళ్ల సిల్హౌట్ ఆమె రూపానికి రిలాక్స్డ్ ఇంకా నిర్మాణాత్మకమైన వైబ్‌ని జోడించింది. ఆమె ప్రయాణాలకు సౌకర్యంగా ఉండేలా ఈ డ్రెస్ సెలక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.. అంతేకాదండోయ్.. ఆమె ధరించిన స్టైలిష్ డ్రెస్కు మ్యాచ్ అయ్యేలా ఖరీదైన వాచ్ ను కూడా పెట్టుకుంది. కార్టియర్ శాంటాస్ డి కార్టియర్ వాచ్‌తో రూపాన్ని పూర్తి చేసింది. దీని ధర 3,080,000 ఉంటుంది.. ఆ డ్రెస్సుకు తగ్గట్లు లైట్ మేకప్ అలాగే హెయిర్ స్టయిల్ బాగా మ్యాచ్ అయ్యింది. దాంతో ఆమె స్టయిల్ మరింత పెంచింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ఫోటోల పై మీరు ఒక లుక్ వేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ చెయ్యండి… ఇక దీపికా సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ సరసన కల్కి 2 చేస్తున్న విషయం తెలిసిందే..