E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

JR NTR : జపాన్ భూ కంపాలపై జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి.. ధైర్యంగా ఉండాలని ట్వీట్

JR NTR : జపాన్ భూ కంపాలపై జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి.. ధైర్యంగా ఉండాలని ట్వీట్
Advertisement

JR NTR : ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ జపాన్‌లో దాదాపు 155 సార్లు భూమి కంపించింది. కోటి ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టీ పెట్టగానే ప్రకృతి ప్రకోపించింది. వరుస భూకంపాల ధాటికి పశ్చిమ ప్రాంతం అల్లకల్లోలమైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. వరుసగా సంభవించిన భూకంపాలతో తొలుత భారీ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది.

జపాన్‌లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై హీరో జూనియర్ ఎన్టీఆర్‌ X వేదికగా స్పందించారు. జపాన్ లో సంభవించిన భూకంపాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్‌లో షూటింగ్ ముగించుకొని తిరిగి న్యూ ఇయర్ రోజున రాత్రి ఆయన హైదరాబాద్ వచ్చారు. జపాన్‌లో వారం రోజులు ‘దేవర’ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రాంతంలోనే భూకంపం రావడం తన హృదయాన్ని కలచివేసిందని ఎన్టీఆర్ అన్నారు. “భూకంప ప్రభావిత ప్రాంత ప్రజల గురించి ఆలోచిస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అందరూ ధైర్యంగా ఉండాలి” అని ఎన్టీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Tags

Related News

Kissik Talks Show :హీరోయిన్ అవ్వాలంటే బాడీ మెజర్మెంట్స్ కావాలా? స్నో అక్క’ మౌనిష కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ వైరల్!

ప్రియుడితో కలిసి భర్తను నీటి ట్యాంకులో తోసి చంపిన ఇన్‌ఫ్లుయెన్సర్!

BigTv Kissik Talks : కళ్యాణ్ జీవితంలో ఊహించని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Kissik Talks Show : రీతూ అంటే అంత కోపం ఏంటి బ్రో.. ఒక్కమాటతో పరువు తీసేశాడుగా..

Kissik Talks Show : మనోడు ప్రేమలో పడ్డాడురోయ్.. ఆ అమ్మాయితోనే పెళ్లి..?

ఓర్నీ.. ఏంట్రా ఇది.. కుకింగ్ షోలో ఇదేం రచ్చ రా నాయనా..

Big Tv Kissik Talks : కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రియాంక స్టోరీ.. నమ్మి మోసపోయాను..

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

Big Stories

×