BigTV English

Pawan Kalyan: నేను OG అంటే వాళ్లు క్యాజీ అంటారు.. అందుకే భయంతో ఈ పని చేస్తున్నా

Pawan Kalyan: నేను OG  అంటే వాళ్లు క్యాజీ అంటారు.. అందుకే భయంతో ఈ పని చేస్తున్నా

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఏపీని తయారుచేయడానికి పవన్ కష్టపడుతున్నారు. ఇలా సమస్య అనగానే అలా పరిష్కారం చూపిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఇదంతా ఓకే కానీ, పవన్ అభిమానులు మాత్రం సినిమాలు ఎప్పుడు అని అడుగుతున్నారు.


ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిని ఎప్పటికైనా ఫినిష్ చేయాలనీ పవన్ చూస్తున్నారు. ఇక తాజాగా ఒక సభలో అభిమానులు.. పవన్ సినిమాల గురించి అడిగేశారు. దీంతో తన సినిమాల గురించి పవన్ అందరికి ఒక క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. సభాముఖంగా నిర్మాతలకు క్షమాపణలు తెలిపారు. ఒక సభలో అభిమానులు.. ఓజీ ఓజీ అంటూ గోల చేశారు.

ఇక ఆ మాటలు విన్న ప‌వ‌న్.. ” నేను ఓజీ అంటే వాళ్లు క్యాజీ అంటారు. సినిమాలు చేసే టైముందంటారా?. నిన్ను ఎన్నుకుంటే క‌నీసం రోడ్డు గుంత‌లు అయినా పూడ్చ‌లేదు అని తిట్టించుకోకూడ‌దు కదా.. అందుకే ఆ భయంతోనే మూడు నెలలు పాటు.. రోడ్లు, ప్రజా పాలనపైనే దృష్టిపెట్టాను. ఈ విషయంలో నా నిర్మాత‌ల‌కు క్షమాపణలు చెప్పాను.


ఆంధ్ర‌ప్ర‌జ‌ల‌కు సేవ చేసుకుంటూ కుదిరిన‌ప్పుడ‌ల్లా రెండు మూడు రోజులు సినిమాలు చేస్తాన‌ని చెప్పాను. మీరు OG చూద్దురు గాని.. బాగుంటుంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పవన్ సినిమాల విషయాన్నికొస్తే.. హరిహర వీరమల్లు,OG షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సగానికిపైగా షూటింగ్ జరగాల్సి ఉంది. మరి ఈ సినిమాలతో పవన్ ఎలాంటి విజయాన్నీ అందుకుంటారో చూడాలి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×