BigTV English

Devara 2: ‘దేవర 2’ అప్డేట్ వచ్చేసింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ బొనంజా..

Devara 2: ‘దేవర 2’ అప్డేట్ వచ్చేసింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ బొనంజా..

Devara 2: గ్లోబల్ సార్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత నటించిన సినిమా దేవర.. గత ఏడాది రిలీజ్ అయ్యింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా, కలెక్షన్లు పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. గ్లోబల్ స్టార్టింగ్ నుంచి వచ్చిన మూవీ కావడంతో ఈ మూవీ భారీ క్రేజ్ ని కూడా సంపాదించుకుంది . అయితే ఈ మూవీ ని రెండు పార్ట్ లుగా విడుదల చేయబోతున్నట్లు ముందుగానే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మొదటి పార్ట్ అయిపొయింది ఇక ఇప్పుడు రెండో పార్ట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ మూవీ షూటింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..


దేవర మూవీలో మొదటి పార్ట్ లో ఎన్నో చిక్కు ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానం రెండో పార్ట్ లో దొరికే అవకాశం ఉంది. ఎన్నో ప్రశ్నలకు సమాధానం పార్ట్ 2లోనే చెప్పాల్సి ఉంటుంది. దీనికి టైం పట్టేలా ఉంది కాబట్టి కొరటాల వేరే హీరోతో ఇంకో సినిమా చేస్తాడనే పుకార్లు వచ్చిన నేపథ్యంలో అవేవీ నిజం కాదని తెలిసింది.. ఈ మూవీలో దేవర జన్మ రహస్యం గురించి బయటపడుతుంది. అసలు కథ మొత్తం రెండో పార్ట్ లోనే తెలిసే అవకాశం ఉంది. అందుకే ఈ పార్ట్ ను చాలా భిన్నంగా తెరకేక్కిస్తున్నట్లు వార్తలు అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

Also Read : బిగ్ బాస్ లోపల అంతా అదే… నేను చేసిన పెద్ద ఇదే.. పచ్చి నిజాలు..


ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు.. వార్ 2 చివరి దశలో ఉంది. హృతిక్ రోషన్ తో కలిసి చేయాల్సిన పాట షూట్ ఇటీవలే మొదలయ్యింది. ఇంకో వారం రోజుల్లో అయిపోతుంది. చిన్న ప్యాచ్ వర్క్ మినహా దాదాపు పూర్తయినట్టే. ప్రశాంత్ నీల్ డ్రాగన్ సెట్లో ఏప్రిల్ నుంచి రెగ్యులర్ గా అందుబాటులో ఉండబోతున్నాడు. ఈ ఏడాది నవంబర్లోగా సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. 2026 సంక్రాంతి విడుదల సాధ్యమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనేది మైత్రి మూవీ మేకర్స్ లక్ష్యం. ఇవి అయిపోతే తారక్ చేతిలో కొత్త కమిట్ మెంట్స్ లేవు.. ఇక దేవర 2 మూవీ ఈ ఏడాది మే, జూన్ లో సెట్స్ మీదకు వెళ్ళనున్నట్లు సమాచారం. బడ్జెట్ కూడా భారీగా పెంచబోతున్నారు. ఈసారి విలన్ సైఫ్ అలీ ఖాన్ తో పాటు బాబీ డియోల్ కూడా చేరతాడనే ప్రచారం నిజమేనని తెలిసింది. కాకపోతే క్యాస్టింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు లేవు. అటు జాన్వీ కపూర్ డేట్స్ కూడా ఇవ్వలేదు. అనిరుద్ రవిచందర్ సంగీతం మీద మరిన్ని అంచనాలు నెలకొనబోతున్నాయి. అంతా సవ్యంగా అనుకున్నట్టు జరిగితే 2026 దసరా లేదా దీపావళికి దేవర 2 చూడొచ్చు.. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ కోసం భారీ ప్లాన్ చేస్తున్నాడు.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×