BigTV English
Advertisement

OTT Movie : లంచ్ బాక్స్ లో డ్రగ్స్ బిజినెస్… వీడియోలు తీసి మరీ ఆ పని… ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్

OTT Movie : లంచ్ బాక్స్ లో డ్రగ్స్ బిజినెస్… వీడియోలు తీసి మరీ ఆ పని… ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఓటిటి సంస్థలు కూడా వీటిని పోటీపడి రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓటీటీ లోకి వచ్చిన ఒక క్రైం థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రెండింగ్ అవుతోంది. గంజాయి, డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసే వ్యక్తుల చుట్టూ ఈ వెబ్ సిరీస్ స్టోరీ నడుస్తుంది. జ్యోతిక, షబానా అజ్మీ, శాలిని పాండే ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ ఏడు ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. దాదాపు ప్రతి ఎపిసోడ్ 45 నిమిషాలు ఉండగా, అన్ని ఎపిసోడ్స్ ఎంగేజింగ్ గా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘డబ్బా కార్టెల్’ (Dabba Cartel). ఇందులో షబానా అజ్మీ, జ్యోతిక, శాలిని పాండే, నిమిషా సజియన్, అంజలి ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించారు. కొంతమంది మహిళలు లంచ్ బాక్స్ వ్యాపారం పేరిట డ్రగ్స్ ని సరఫరా చేస్తుంటారు. 1960లో జరిగే ఈ స్టోరీ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28, 2025 నుండి నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

వివా లైఫ్ అనే ఒక సొసైటీలో చాలామంది నివసిస్తూ ఉంటారు. వివా లైఫ్ అనేది ఒక ఫార్మా కంపెనీ. శంకర్ అనే వ్యక్తి ఆ కంపెనీని నడుపుతూ ఉంటాడు. ఇతనికి వరుణ అనే భార్య కూడా ఉంటుంది. ఆమె ప్రెగ్నెన్సీ ముందు అదే కంపెనీలో పని చేసినా, ఇప్పుడు ప్రస్తుతం ఒక క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ దగ్గర హరి అనే వ్యక్తి పని చేస్తూ ఉంటాడు. ఇతడు విదేశాలలో సెటిల్ అవ్వాలనుకుంటూ ఉంటాడు. ఇతని భార్య రాజి డబ్బా వాల బిజినెస్ చేస్తూ ఉంటుంది. క్యారేజ్ బాక్స్ లో లంచ్ ని ప్రిపేర్ చేసి, ఉద్యోగస్తులకు అందించడమే ఈ బిజినెస్. అక్కడే ఉండే మాలా అనే పనిమనిషి ఈమెకు సహాయం చేస్తూ ఉంటుంది. మాలాకి సంతోష్ అనే డ్రైవర్ తో సంబంధం ఉంటుంది. సంతోష్ గంజాయి కి అలవాటు పడి, దాని ద్వారానే డబ్బులు కూడా సంపాదించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే మాలతో లంచ్ బాక్స్ లో గంజాయిని సప్లై చేయమని చెప్తాడు. మొదట ఆమె అందుకు ఒప్పుకోదు. అతనితో గడిపిన ఏకాంత వీడియొ ఒకటి చూపించి, ఆమెను బెదిరించి ఈ పని చెపిస్తాడు.

అలా ఒకసారి రాజీకి ఈ విషయం తెలిసిపోతుంది. అయితే రాజీకి కూడా డబ్బులు అవసరం అవుతుంది. ఎందుకంటే ఆమె ప్రజెంట్ ప్రెగ్నెన్సీ లో ఉంటుంది. భర్త విదేశాలకు వెళ్లేంతవరకు ప్రెగ్నెన్సీ వద్దని చెప్తాడు. ఈ క్రమంలో రాజీ కూడా డబ్బులు సంపాదించాలని గంజాయి బిజినెస్ ని ఎంచుకుంటుంది. ఇలా వీళ్ళు మూడు పూవులు, ఆరు కాయలుగా గంజాయి బిజినెస్ ని రన్ చేస్తుంటారు. మరోవైపు శంకర్ ఫార్మా కంపెనీ నుంచి వచ్చిన ఒక డ్రగ్ వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ డ్రగ్ ని ఇండియాలో నిషేధించి ఉంటారు. బయటి దేశాలకు అమ్మడానికి మాత్రమే దానికి పర్మిషన్ ఉంటుంది. అయితే ఈ నిబంధనలను ఈ ఫార్మా కంపెనీ తుంగలో తొక్కుతుంది. అజిత్ అనే పోలీస్ ఆఫీసర్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. చివరికి గంజాయి బిజినెస్ ని పోలీసులు కనిపెడతారా? వివ లైఫ్ ఫార్మా కంపెనీ పై కేసు నమోదు అవుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘డబ్బా కార్టెల్’ (Dabba Cartel) అనే ఈ వెబ్ సిరీస్ ని చూడండి.

Tags

Related News

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Big Stories

×