Aditya Om : టాలీవుడ్ టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు విమర్శలు అందుకుంటున్నా కూడా మరోవైపు టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ లో ఎక్కువ సీజన్లను పూర్తి చేసుకుంది. టాలీవుడ్ మాత్రం ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. అన్ని సీజన్లతో పోలిస్తే 8వ సీజన్ కాస్త ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ వచ్చిన ఈ షో లో కన్నడ బ్యాచ్ పెర్ఫార్మన్స్ అందరిని బాగా అలరించాయి. విన్నర్ గా సీరియల్ యాక్టర్ నిఖిల్ నిలిచాడు. ఈ షోను కొత్తగా ట్రై చేశారు. కొంతవరకు సక్సెస్ అయ్యింది. ఈ సీజన్ లో సినీ నటుడు ఆదిత్య ఓం కూడా పాల్గొన్నాడు. తన ఆట తీరు జనాలను మెప్పించలేకపోయింది. దాంతో ఈయన ఎక్కువ రోజులు షోలో ఉండలేకపోతారు. అయితే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళందరూ బిగ్ బాస్ లో జరిగేది ఇదే అంటూ పలు చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. అవి ఎంతగా వైరల్ అవుతుంటాయో మనం చూస్తూనే ఉన్నాము.. తాజాగా ఆదిత్య ఓం కూడా నువ్వు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి సంచల న విషయాలను బయట పెట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.
టాలీవుడ్ లో ఒకప్పుడు పలు సినిమాల్లో నటించి క్రేజ్అందుకున్న హీరో ఆదిత్య ఓం.. అయితే ఈయన చేసిన సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. కొద్దిరోజులు సినిమాలకు డైరెక్టర్గా కూడా పనిచేస్తాడు ఆ తర్వాత కంప్లీట్ గా సినిమాలకి దూరమయ్యాడు. రీసెంట్గా బిగ్ బాస్ ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. హౌస్ లో తన పర్ఫామెన్స్ యావరేజ్ గా ఉండడంతో జనాలు అన్ని హౌస్ లో ఉండడానికి అనుకున్నారు దాంతో కొన్ని వారాలకి అయినా నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. అయితే ఆయన బిగ్ బాస్ గురించి పలు చానల్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తెలిసిందే.. తాజాగా మరోసారి బిగ్ బాస్ పై సంచల వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఎమన్నాడంటే..
Also Read : సాయి పల్లవి ఇంట మళ్లీ పెళ్లి.. ఎవరిదై ఉంటుందబ్బా..?
టాలీవుడ్ హీరో ఆదిత్య ఓం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.. ఈ సందర్భంగా ఆయన తన సినిమాల గురించి పంచుకున్నారు. సినిమాలు ఎలా ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితమే ఎలా ప్రభావితం చేస్తాయని ఆదిత్య చక్కగా వివరించారు. అయితే ఈ సందర్భంగా ఆయనకు బిగ్ బాస్ గురించి ఒక ప్రశ్న ఎదురయింది. మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా.. నాకు ఫస్ట్ బిగ్ బాస్ అంటే ఏంటో కూడా తెలియదు కళ్ళు మూసుకొని హౌస్ లోకి వచ్చేసాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత తెలిసింది ఇలా ఉంటుందా అని అన్నాడు. మీకు బిగ్ బాస్ నచ్చలేదా అని యాంకర్ మరోసారి ప్రశ్నించగా.. నాకు బిగ్ బాస్ అస్సలు నచ్చలేదు బయట ఒకటి లోపల ఒకటి లాగా ఉంటుంది కానీ నేను అలా ఉండను ఒకసారి ఎలిమినేషన్ లో అలానే జరిగింది ఆ తర్వాత నన్ను కావాలని టార్గెట్ చేసి మరి బయటికి పంపించారు అందుకే నాకు బిగ్ బాస్ అంటే కాస్త కోపంగానే ఉంటుంది. ఎప్పుడూ లేని వింత ఎక్స్పీరియన్స్ ని నేను బిగ్ బాస్ లో ఫేస్ చేశాను అని ఆదిత్య అన్నారు. మొత్తానికి అయితే బిగ్బాస్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆదిత్య ఓం ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడం తో ఆయనపై నీటి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. షో నచ్చలేదు అని అన్నారు రెమ్యూనిస్టు మాత్రం బాగానే తీసుకున్నారు ఇప్పుడు ఇలా మాట్లాడడం భావ్యం కాదు అంటూ కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ఆదిత్య ఓం ఇంటర్వ్యూ మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది..