BigTV English
Advertisement

Janvi Kapoor : కోలీవుడ్ స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన దేవర బ్యూటీ..

Janvi Kapoor : కోలీవుడ్ స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన దేవర బ్యూటీ..

Janvi Kapoor : బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. తెలుగులో మొదటి మూవీనే ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని అందుకుంది.. ఆ మూవీలో అమ్మడు పాత్రకు పెద్దగా ప్రాదాన్యత లేకపోయిన కూడా తెలుగులో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో తెలుగులో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ఓ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఇది సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో ఆఫర్ ఆమెను వరించింది. ఇంతకీ హీరో ఎవరు? మూవీస్ డైరెక్టర్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..


జాన్వీ కపూర్ సినిమాలు.. 

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. మొదటి మూవీతోనే బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటించిన చాన్వీ కపూర్ తెలుగులో కూడా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉంది. తెలుగులోకి ఎన్టీఆర్ నటించిన దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. అందులో ఈ అమ్మడు ఎక్కువగా కనిపించలేదు కానీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది మూవీలో నటిస్తుంది.. ఇది ఇంకా పూర్తి అవ్వలేదు కానీ ఇప్పుడు కోలీవుడ్ లోకి అడుగు పెట్టిందనే టాక్ చక్కర్లు కొడుతుంది..


Also Read: ‘స్పిరిట్ ‘ స్టోరీ లీక్.. కొంపదీసి మరో అర్జున్ రెడ్డినా..?

కోలీవుడ్ స్టార్ హీరో మూవీలో ఛాన్స్.. 

బాలీవుడ్ నుంచి తెలుగులో కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తెలుగులో కూడా సత్తాను చాటెందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవలే బోణీ కపూర్ చెన్నై లో ధనుష్ తో భేటీ అయినట్లు సమాచారం. దీనిలో భాగంగా జాన్వీ కపూర్ డెబ్యూ విషయంలో ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. అదే నిజమైతే ధనుష్‌ 57వ చిత్రంతోనే జాన్వీ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ చిత్రాన్ని ధనుష్ స్వీయా దర్శకత్వం లో ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ `ఇడ్లీకడై` మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. బాలీవుడ్ లో `తేరే ఇష్క్ మే`లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల అనంతరం ధనుష్ 56వ చిత్రం మారిసెల్వరాజ్ దర్శకత్వం లో రూపొందుతుంది.. హాంగ్ అవ్వాలి. త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

ఇక జాన్వీ కపూర్ ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోల ను షేర్ చేస్తుంది. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. గ్లామర్ లో తల్లిని మించిపోయింది. ఏది ఏమైనా జాన్వీ లేటెస్ట్ ఫోటోల కోసం ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×