OTT Movie : బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక మూవీ థియేటర్లలో విజయం సాధించి, ఓటీటీలో కూడా మంచి వ్యూస్ తో అదరగొడుతోంది. ఈ సినిమా నిజ జీవిత సంఘటనల నుండి స్ఫూర్తి పొందింది. పాకిస్థాన్ వ్యక్తి చేతిలో ప్రేమ పేరుతో మోసపోయిన అమ్మాయి చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఓటీటీలో గ్లోబల్ ట్రెండ్ అవుతోంది ? ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఉజ్మా అహ్మద్ అనే భారతీయ మహిళ, మలేషియాలో టాక్సీ డ్రైవర్ అయిన తాహిర్ ని కలుస్తుంది. అతని ప్రేమలో పడి పాకిస్తాన్ కి అతనితో పాటు వెళ్తుంది. అయితే తాహిర్ ఆమెను మోసం చేసి, కైబర్ పఖ్తుంఖ్వాలోని బునర్ అనే గ్రామానికి తీసుకెళ్లి, బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. ఆమెను శారీరక, మానసిక ఇబ్బందులకు గురవుతుంది. తాహిర్ ఆమెను హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్‌లో భాగంగా విక్రయించే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. ఉజ్మా పాకిస్థాన్ లోని భారత హై కమిషన్‌లో ఆశ్రయం పొందుతుంది. మరోవైపు జె.పి. సింగ్, పాకిస్తాన్‌లోని భారత హై కమిషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తూ, ఉజ్మా కేసును తీసుకుంటాడు.
పాకిస్తాన్ అధికారులు ఆమెను భారత గూఢచారిగా భావించి, ఆమెను తిరిగి భారత్‌కు పంపడానికి అడ్డంకులు సృష్టిస్తారు. జె.పి. సింగ్ విదేశాంగ మంత్రి సహాయంతో, చట్టపరమైన సవాళ్లు, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఉజ్మాను వాఘా సరిహద్దు ద్వారా సురక్షితంగా భారత్‌కు తిరిగి తీసుకురావడానికి పోరాడతాడు. చివరికి జె.పి.సింగ్ ఎటువంటి సమస్యలను ఎదుర్కుంటాడు ? ఉజ్మా, తాహిర్ చేతిలో ఎలా మోసపోయింది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : పేరెంట్స్ లేని లోటు అమ్మాయి తీరిస్తుందా ? మైండ్ బ్లోయింగ్ స్టోరీతో ఓటీటీలోకి వచ్చిన కన్నడ సినిమా
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది డిప్లొమాట్’ (The Diplomat). 2025 లో వచ్చిన ఈ సినిమాకు శివం నాయర్ దర్శకత్వం వహించారు. ఇందులో జాన్ అబ్రహం, సాదియా ఖతీబ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా స్టోరీ ఒక భారతీయ రాయబారి అయిన జె.పి. సింగ్ (జాన్ ఆబ్రహం) కథ ఆధారంగా రూపొందింది. ఈ మూవీ 2017లో ఉజ్మా అహ్మద్ (సాదియా ఖతీబ్) అనే భారతీయ మహిళ పాకిస్తాన్‌లో బలవంతంగా పెళ్లి చేసుకుని, హ్యూమన్ ట్రాఫికింగ్ లో విక్రయించే సమయంలో ఆమెను భారత్‌కు తిరిగి తీసుకురావడానికి జె.పి. సింగ్ చేసిన కృషిని చూపిస్తుంది. ఈ సినిమా మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. మే 9 నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కు వచ్చింది.