OTT Movie : మలయాళం సినిమాలను చూడటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మూవీ లవర్స్. చాలా సినిమాలు రియాలిటీకి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంటాయి. అక్కడి దర్శకుల కన్ను ఇప్పుడు టాలీవుడ్ పై పడింది. అందుకే ఇక్కడ మార్కెట్ పెంచుకునేందుకు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక బస్ కండక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఉద్యోగంతో మొదలయ్యే ఈ స్టోరీ సరదాగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
గౌతమి ఒక సింగిల్ మదర్ గా ఉంటుంది. ఆమె KSRTC బస్సు కండక్టర్‌గా తాత్కాలిక పదవిలో పనిచేస్తుంది. కోరా అనే వ్యక్తి ఆమె బస్సులో ట్రైనీ కండక్టర్‌గా చేరతాడు. అయితే గౌతమి ఉద్యోగం తాత్కాలికమైనది కావడంతో ఆమె ఉద్యోగం కోల్పోతుంది. దీనివల్ల ఆమె ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. అందుకుగానూ గౌతమి కోరా పట్ల కాస్త కోపంగానే ఉంటుంది. గౌతమి తన కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి అనేక రకాల బాధ్యతలను నిర్వహిస్తూ కష్టపడుతుంది. కోరా, గౌతమి పట్ల ఎటువంటి ద్వేషం లేకుండా, ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ తరువాత ఈ స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది.
అయితే ఇరు కుటుంబాల నుండి ఈ సంబంధానికి అనుమతి పొందడం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఈ క్రమంలో గౌతమి, కోరా ఇద్దరూ పంచాయతీ సెక్రటరీ పదవికి పోటీ పడతారు. ఈ పోటీలో గౌతమి, కోరాకి ఒక కండిషన్ పెడుతుంది ? ఆ తరువాత స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. చివరికి గౌతమి, కోరా లవ్ స్టోరి ఏమౌతుంది ? పంచాయతీ పోటీలో ఎవరు గెలుస్తారు ? గౌతమి పెట్టే కండిషన్ ఏంటి ? ఇంట్లో పెద్దలు పెళ్ళికి ఒప్పుకుంటారా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : పేరెంట్స్ లేని లోటు అమ్మాయి తీరిస్తుందా ? మైండ్ బ్లోయింగ్ స్టోరీతో ఓటీటీలోకి వచ్చిన కన్నడ సినిమా
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘రాహెల్ మకన్ కోరా’ (Rahel Makan Kora). 2023 లో వచ్చిన ఈ మలయాళం మూవీకి ఉబైని దర్శకత్వం వహించారు. ఈ మూవీ స్టోరీ గౌతమి, కోరా అనే రెండు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఆన్సన్ పాల్ (కోరా), మెరిన్ ఫిలిప్ (గౌతమి), స్మిను సిజో (రాహెల్), అల్తాఫ్ సలీం ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి సంగీతం కైలాస్ మీనన్ అందించారు. సైనా ప్లే (Saina play), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.