BigTV English

Devara: దేవర టార్గెట్.. అన్ని వందల రూ.కోట్లా .. గట్టెక్కేరా..?

Devara: దేవర టార్గెట్.. అన్ని వందల రూ.కోట్లా .. గట్టెక్కేరా..?

Devara.. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ (Jr. NTR) నటిస్తున్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో గతంలో జనతా గ్యారేజ్ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు అదే డైరెక్టర్ తో దేవర సినిమా చేస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన అనగా రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi kapoor)తొలిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ గా నటిస్తున్నారు..అలాగే శృతి మరాఠీ (Shruti Marathi)కూడా ఎన్టీఆర్ మరో క్యారెక్టర్ కు భార్యగా నటిస్తోంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే బిజినెస్ బాగానే జరిగింది. ఇప్పటికే థియేట్రికల్ తో పాటు ఓటీటీ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా దేవర థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే..

దేవర థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్..


నైజాం – రూ.45 కోట్లు

ఆంధ్ర – రూ.46 కోట్లు

సీడెడ్ – రూ.22 కోట్లు

కర్ణాటక – రూ.15 కోట్లు

తమిళనాడు – రూ .6 కోట్లు

కేరళ – రూ.50 లక్షలు

నార్త్ మొత్తం – రూ.20 కోట్లు కాగా, ఓవర్సీస్ రూ.26 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇలా దాదాపుగా రూ.180 కోట్ల వరకు దేవర ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

రూ.360 కోట్ల టార్గెట్ తో బరిలోకి..

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం రూ.360 కోట్లకు పైగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే కనీసం రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తెలుగు రాష్ట్రాలలోనే రూ.230 కోట్ల వసూలు చేస్తే దేవర హిట్ అయినట్టే అని సమాచారం. దీంతో ఎన్టీఆర్ కి ప్రపంచవ్యాప్తంగా భారీ టార్గెట్ ఏర్పడింది. మరి సోలో హీరోగా ఎన్టీఆర్ మొదటిసారి ఇంత భారీ బిజినెస్ జరగడం, ఇంత పెద్ద టార్గెట్ ముందు నిలవడం ఆశ్చర్యంగా అనిపించినా రూ .500 కోట్ల గ్రాస్ టార్గెట్ పెట్టుకొని, ఇప్పుడు బరిలోకి దిగుతున్నారు. ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఇంత బడ్జెట్ మూవీతో భారీ టార్గెట్ పెట్టుకొని ముందుకు వస్తున్న ఎన్టీఆర్ కి ఎలాంటి విజయం లభిస్తుందో చూడాలి. .

ఎన్టీఆర్ కెరియర్..

ఎన్టీఆర్ విషయానికి వస్తే.. బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం వంటి చిత్రాలలో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఎన్టీఆర్ , ఆ తర్వాత 2001లో నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ , సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు చేసి ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎన్టీఆర్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×