BigTV English

Devara: దేవర ఈసారి ముందే వస్తున్నాడు.. ఇక పూనకాలే

Devara: దేవర ఈసారి ముందే వస్తున్నాడు.. ఇక పూనకాలే

Devara: ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ వెండితెరపై కనిపిస్తాడా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్.. దేవర సినిమా ప్రకటించాడు. ఇప్పటికి రెండేళ్లు అవుతుంది.. ఇంకా దేవర వాయిదాల మీద నడుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.


ఆర్ఆర్ఆర్ తరువాత ఎలాగైనా హిట్ కొట్టాలని ఎన్టీఆర్.. ఆచార్య లాంటి డిజాస్టర్ తరువాత ఎలాగైనా నిలబడాలని కొరటాల.. ఎంతో కసిగా దేవరను తెరకెక్కించారు. ఒక సినిమాను కాదు.. ఒక శిల్పాన్ని చెక్కినట్లు చెక్కారు. ఎక్కడ.. ఏ పొరపాటు జరగకుండా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నారు. అన్ని బావుంటే ఈపాటికి దేవర రిలీజ్ కూడా అయిపోయేది. కానీ, కొన్ని కారణాల వలన దేవర వెనక్కి వెళ్తూ వచ్చింది. అలా చివరికి దేవర రెండు పార్ట్స్ గా విడిపోయి మొదటి పార్ట్ అక్టోబర్ 10 న రిలీజ్ అవ్వడానికి సిద్దమయ్యింది.

ఏదో ఒకటిలే.. ఎన్ని వాయిదాలు పడినా మంచి సినిమాతో వస్తున్నాం అని ఫ్యాన్స్ సైతం ఆ డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికే దేవర సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ఏ రేంజ్ లో అదరగొట్టాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ కు మేకర్స్ ఒక స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. దేవర అక్టోబర్ 10 న కాదు.. దానికన్నా ముందే అభిమానుల ముందుకు దేవర రానుంది. అవును గత కొన్నిరోజులుగా దేవర.. సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే.


ఇప్పుడుదాన్నే అధికారికం చేస్తూ మేకర్స్ సైతం కొత్త పోస్టర్ తో కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 27 న దేవర వస్తున్నాడు అని తెలిపారు. మాములుగా అయితే ఆరోజు OG రావాల్సి ఉంది. ఆ సినిమా వాయిదా పడడంతో దేవర ఆ డేట్ ను లాగేసుకుంది. ఇక  ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ – కొరటాల ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×