BigTV English
Advertisement

Devara: నిలబడింది తారక్ , కానీ నిలబెట్టింది అనిరుధ్

Devara: నిలబడింది తారక్ , కానీ నిలబెట్టింది అనిరుధ్

Devara: కొన్నిసార్లు ఎంతో నమ్మకంతో చేసిన కొన్ని పాటలకి సరైన ఆదరణ దక్కకపోవచ్చు. కానీ ఇంకొన్నిసార్లు ఒక మామూలుగా చేసిన పాట కూడా విపరీతంగా ఫేమస్ అవ్వచ్చు. అలా ఒక్కసారిగా “కొలవెరి ఢీ” అనే పాట అనిరుధ్ కి విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఇండియా వైడ్ గా ఈ పాట బాగా పాపులర్ అయింది. ధనుష్, శృతిహాసన్ కలిసిన నటించిన త్రీ అనే సినిమా కోసం ఈ పాటను కంపోజ్ చేశాడు అనిరుధ్. ఈ పాటతో సినిమాకి కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమా మాత్రం ఊహించిన స్థాయిలో ఆడలేదు. అక్కడితో అనిరుధ్ మాత్రం మంచి పేరును సాధించుకున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన సత్తాను చూపించాడు.


ప్రస్తుతం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రస్తావన వస్తే అనిరుద్ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. తన మ్యూజిక్ తో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను అద్భుతంగా ఎలివేట్ చేస్తాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఎన్నో సినిమాల్లో కూడా అనిరుధ్ మార్క్ క్లియర్ గా కనిపించింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్, లియో, విక్రమ్ వంటి సినిమాలలో అనిరుద్ మ్యూజిక్ ఒక కీ రోల్ ప్లే చేసింది. అలానే నెల్సన్ దర్శకత్వం వహించిన డాక్టర్, బీస్ట్, జైలర్ వంటి సినిమాలకు కూడా అనిరుధ్ మ్యూజిక్ మంచి ప్లస్ అని చెప్పాలి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిరుధ్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అప్పటికే అరవింద సమేత వీర రాఘవ సినిమా అవకాశం కూడా కోల్పోయాడు అనిరుధ్. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని నటించిన జెర్సీ సినిమాతో తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. ఇప్పటికీ కూడా జెర్సీ సినిమాకి అనిరుద్ అందించిన సంగీతం మేజర్ ప్లస్ పాయింట్ అనిపిస్తుంది. అనిరుధ్ లేకపోతే ఆ సినిమాని ఊహించలేము.


కేవలం యంగ్ డైరెక్టర్స్ తో పనిచేయడం మాత్రమే కాకుండా చాలామంది స్టార్ హీరోలకు భారీ ఎలివేషన్ తన మ్యూజిక్ తో ఇచ్చాడు అనిరుధ్. ఇక ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమాకి మిస్ అయిన అవకాశాన్ని మరోసారి అందిపుచ్చుకొని దేవర సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. దేవర సినిమాకి అనిరుద్ ఇచ్చిన సంగీతం మేజర్ ప్లస్ పాయింట్. సినిమాలో కనిపించేది ఎన్టీఆర్ అయినా, వినిపించేది మాత్రం అనిరుద్. అవకాశం ఉన్న ప్రతి చోట తన పనితనాన్ని చూపించి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు అని చెప్పాలి. వాస్తవానికి అనిరుధ్ లేకపోతే ఈ సినిమాని అసలు ఊహించలేము. ఇక్కడితో కేవలం తమిళ్ హీరోల సినిమాలకు మాత్రమే కాదు తెలుగు సినిమాలలో కూడా అనిరుధ్ తన సత్తా చూపిస్తాను అని నిరూపించాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×