BigTV English

Devara vs kalki : దేవర vs కల్కి.. బుకింగ్స్ లో పై చేయి ఎవరిదంటే?

Devara vs kalki : దేవర vs కల్కి.. బుకింగ్స్ లో పై చేయి ఎవరిదంటే?

Devara vs kalki : టాలీవుడ్ యంగ్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాను డైరెక్టర్ కొరటాలా శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నెల 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటుగా సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన సంగతి తెలిసిందే.. దీనిపై సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగాయి. ఇక ఇప్పుడు ప్రీ బుకింగ్స్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా కల్కి సినిమాను రీచ్ చేసిందా? లేదా అనే ప్రశ్న పై ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య చర్చలకు దారీ తీసింది. మరి ఈ ప్రీ బుకింగ్స్ లో పై చేయి ఎవరిదో ఇప్పుడు తెలుసుకుందాం..


Devara vs Kalki who has the highest pre-bookings
Devara vs Kalki who has the highest pre-bookings

కల్కి vs దేవర ప్రీ బుకింగ్స్..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ కల్కి.. ఈ సినిమా ఈ మధ్య నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి కథ కావడంతో సినిమా పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా భారీ కలెక్షన్స్ వసూల్ చేసింది. ఈ సినిమా మేనియా ఇంకా కొనసాగుతుంది. ఓటీటీలో కి వచ్చినా కూడా క్రేజ్ తగ్గలేదు.. ఇక ఈ సినిమా ప్రీ బుకింగ్స్ చూస్తే బుక్ మై షో టికెట్స్ బుకింగ్ అనలిటిక్స్. ఈ సైట్‌లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ విడుదలకు మూడు రోజుల ముందు 3,30,000 వేల అమ్ముడు పోగా గంటకి 15 వేల 420 టికెట్లు అమ్మడయ్యాయి. అదే విధంగా వన్ మిలియన్ యూజర్స్ ను అందుకుంది.. ఇది ప్రభాస్ హిస్టరీలో ఆల్ టైం రికార్డ్ అనే చెప్పాలి..


ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ప్రీ బుకింగ్స్ ను చూస్తే.. ఒక లక్ష ఆరు వేల టికెట్లు అమ్మితే గంటకి 3 వేల 780 టికెట్ల అమ్మకాలు క్రియేట్ చేస్తోంది. కాగా, దేవరకి 772.3K యూజర్స్ ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో ప్రభాస్, తారక్ అభిమానుల మధ్య రచ్చ షురూ అయ్యింది. అంతేకాకుండా ప్రభాస్ ‘సలార్’ మూవీ కూడా రిలీజ్‌కు ముందే 82 వేలు బుకింగ్స్ అయ్యాయి. ఎటు చూసిన కల్కి రికార్డ్ ను ఎన్టీఆర్ దేవర సినిమా టచ్ చెయ్యలేదు. కల్కి vs దేవరలో ప్రభాస్ సినిమాదే పై చెయ్యి.. ఇక దేవర కు ఇప్పటివరకు భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా నుంచి విడుదలైన రెండు ట్రైలర్స్ సినిమా పై హైఫ్ ను క్రియేట్ చేశాయి. ఇక సినిమా కూడా బాగుంటుందని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో, కొరటాల జనాల మైండ్ సెట్ కు రీచ్ అయ్యేలా చేశాడో.. లేదో తెలియాలంటే రెండు రోజులుగా వెయిట్ చెయ్యాల్సిందే..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×