BigTV English

Devara: వామ్మో.. దేవర ప్రీ రిలీజ్ డ్యామేజ్ విలువ.. అన్ని లక్షలా.. ?

Devara: వామ్మో.. దేవర ప్రీ రిలీజ్ డ్యామేజ్ విలువ..  అన్ని లక్షలా.. ?

Devara: మ్యాన్ అఫ్ మాసెస్  ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా దేవర.  దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27 న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.  టాలీవుడ్ లోనే ఎక్కువ ఫ్యాన్స్ బేస్ ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకడు.   తారక్ సినిమా వస్తుంది అంటే ఏ రేంజ్  హంగామా  ఉంటుంది అనేది ప్రత్యేకంగా  చెప్పాల్సిన  అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ పాన్ ఇండియా హీరోగా మారిపోవడంతో దేవరపై అంచనాలు  ఆకాశాన్ని తాకుతున్నాయి.


ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్స్,  సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రం రెండు రోజుల క్రితం నోవాటెల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. అయితే లాస్ట్ మినిట్ లో ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. అందుకు కారణం..  ఎన్టీఆర్ ఫ్యాన్స్  చేసిన రచ్చనే.  నోవాటెల్ లో  జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పరిమితి మించి పాసెస్ ఇవ్వడంతో.. ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరు ఎగబడ్డారు. లోపలికి అనుమతి లేదని చెప్పినా వినకుండా అస్సలు బద్దలుకొట్టుకొని మరీ  లోపలి వెళ్లారు. దీనివలన  నోవాటెల్  మొత్తం గందరగోళం అయ్యింది.

ఇక తారక్ ఫ్యాన్స్ చేసిన రచ్చ వలన భారీగా నష్టపోయింది మాత్రం నోవాటెల్ అని చెప్పాలి. అది కూడా అక్షరాలా రూ. 33 లక్షల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఇదేమి చిన్న మొత్తం కాదు.  మెయిన్ గ్లాస్, ఎలివేటర్ గ్లాస్, కొన్ని డోర్లు, ఎన్నో కుర్చీలు  డ్యామేజ్ అయ్యాయని సమాచారం.  ఒక్క కుర్చీలకు సంబంధించిన  బిల్లు నే రూ. 7 లక్షలు అని మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే.. నోవాటెల్ భవిష్యత్తులో ఇలాంటి మరో ఈవెంట్ ను ఒప్పుకోదు. అంతలా డ్యామేజ్ జరిగింది. ఇక ఈ డ్యామేజ్ మొత్తాన్ని పూడ్చాల్సిన బాధ్యత దేవర మేకర్స్ మీదనే ఉంది.


అందుతున్న సమాచారం ప్రకారం .. రూ. 33 లక్షలు ఇవ్వడం అంటే  కష్టమని, కొంతవరకు తగ్గించాలని నోవాటెల్ యాజమాన్యంతో దేవర మేకర్స్  చర్చలు జరుపుతున్నట్లు  తెలుస్తోంది. మరి నోవాటెల్ యజమాన్యం  ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇక దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ కానుంది. ఈ సమయంలో ఇంకోసారి ఈవెంట్ ను పెట్టడం కష్టమే.  దేవర సక్సెస్ తరువాత .. సక్సెస్  మీట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఆ ఈవెంట్  ఎలా ఉండబోతుందో చూడాలంటే కొన్నిరోజులు వేచి ఉండాల్సిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×