E-Paper
Advertisement

Devara First Single: వస్తున్నా.. హైప్ పెంచేస్తున్న దేవర టీమ్..!

Devara First Single: వస్తున్నా.. హైప్ పెంచేస్తున్న దేవర టీమ్..!
Advertisement

NTR’s Devara Movie First Single Release Date Fixed: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ వెండితెరపై కనిపించి లేదు. దీంతో అభిమానులు ఎన్టీఆర్ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న దేవర మొదటి భాగం అక్టోబర్ లో దసరా కానుకగా రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ పెంచేస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.గత కొన్నిరోజుల నుంచి సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు కానీ, కరెక్ట్ డేట్ చెప్పలేదు.

Advertisement

ఇక తాజాగా టి సిరీస్.. దేవర లోని ఎన్టీఆర్ పోస్టర్ డైలాగ్ వస్తున్నాం అనే గిఫ్ ను రిలీజ్ చేస్తూ ఇంకా హైప్ పెంచింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ ను మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రోమో కానీ, పోస్టర్ కానీ రిలీజ్ చేయనున్నారట మేకర్స్.

Also Read: Actress Laya: స్టార్ డైరెక్టర్.. నా అంతు చూస్తా అని బెదిరించాడు

Advertisement

దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే వేచి చూడాల్సిందే. ఇకపోతే ఎన్టీఆర్ దేవర తో పాటు వార్ 2 సినిమాతో కూడా బిజీగా మారాడు. బాలీవుడ్ లో వార్ 2 తో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్ మరో హీరో. మరి ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×