Big Stories

Sachin’s Security Guard: సచిన్ సెక్యూరిటీ గార్డు సూసైడ్..?

Sachin Tendulkar’s Security Guard Suicide: ప్రముఖ క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సచిన్ టెండూల్కర్ భద్రతలో ఉన్న ఎస్ఆర్పీఎఫ్ (స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) జవాన్.. జామ్ నర్ పట్టణంలోని తన నివాసంలో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అతను సెలవుపై స్వగ్రామానికి వెళ్లి తన ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇందుకు సంబంధించి జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మృతుడు ప్రకాష్ కాపాడేగా జామ్ నర్ పోలీసులు గుర్తించారు. ప్రకాష్ కాపాడే సెలవుపై స్వగ్రామనికి వెళ్లాడు. అయితే, బుధవారం తెల్లవారుజామున అతను తన సర్వీస్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని.. వీవీఐపీ భద్రత కోసం మోహరించిన సెక్యూరిటీ గార్డు కాబట్టి ఇందుకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుందని అక్కడి పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News