Big Stories

IPL 2024 Playoffs Scenario: ఐపీఎల్ సీజన్ 2024లో ప్లే ఆఫ్ కి వెళ్లే జట్లు ఇవే: హర్భజన్ సింగ్

Harbhajan Singh’s IPL 2024 Playoffs Scenario: నిత్యం వార్తల్లో ఉంటూ, ప్రతీ ఘటనపై ఆవేశంగా స్పందించే వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నేడు కూల్ గా ఒక మాట చెప్పాడు. అదేమిటంటే.. ఐపీఎల్ సీజన్ 2024లో ప్లే ఆఫ్ కి వెళ్లే నాలుగు జట్లు ఇవే అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

ఇంతకీ హర్భజన్ చెబుతున్న ఆ నాలుగు జట్లు ఏమిటంటే హైదరాబాద్ సన్ రైజర్స్ కి అవకాశాల్లేవన్ బాంబ్ పేల్చాడు. చెన్నయ్ సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ మూడు జట్లు వెళతాయని అన్నాడు. కోల్ కతా ఆల్రడీ వెళ్లిపోయింది కాబట్టి, వీటికే ప్లే ఆఫ్ అవకాశాలున్నాయని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.

- Advertisement -

ఏసీ-డీసీగా ఆడుతున్న ఆర్సీబీకి అవకాశాలు ఉంటాయని చెప్పడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆర్సీబీ ఆఖరి మ్యాచ్ గెలిచినా 14 పాయింట్లతో ఉంటుంది. రన్ రేట్ తో మెరుగ్గా ఉన్నా, పైన ఆడే జట్లు 14కన్నా ఎక్కువ సంపాదిస్తే, ఆర్సీబీ ఏం చేయగలదు? అని అంటున్నారు.

Also Read: Rohit Sharma : నా జీవితంలో ఎన్నో కష్టాలు చూశాను: కెప్టెన్ రోహిత్ శర్మ

మరోవైపు హైదరాబాద్ రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండు గెలిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్ కి వెళుతుంది. అప్పుడు హైదరాబాద్ వెళ్లదని ఎలా చెప్పగలడు?అని అంటున్నారు. ఇప్పుడు కోల్ కతా, రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశాలు పదిలంగా ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రడీ 14 పాయింట్లతో ఉంది. ఇంకో మ్యాచ్ మాత్రమే ఉంది. అది గెలిస్తే 16 పాయింట్లతో ఆర్సీబీని దాటేస్తుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే హైదరాబాద్, చెన్నై మిగిలిన రెండు స్థానాలను భర్తీ చేస్తాయని అంటున్నారు.

ఇప్పుడు 14 పాయింట్లతో ఢిల్లీ ఉంది. ఇంకా లక్నో, ఆర్సీబీ రెండు కూడా 12 పాయింట్లతో ఉన్నాయి. వాటికి మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అందులో గెలిస్తే రెండు జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. అలా ఢిల్లీతో కలిపి మూడు జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. ఇప్పుడు చెన్నై, హైదరాబాద్ కూడా ఆడాల్సినవి ఓడిపోతే, అన్ని జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. అప్పుడవి 5 జట్లు అవుతాయి.

Also Read: ఆర్సీబీకి అవకాశాలు ఉన్నట్టా..? లేనట్టా..?

అలా రన్ రేట్ ప్రకారం చూస్తే.. టాప్ లో సీఎస్కే, హైదరాబాద్, ఆర్సీబీ ఉంటాయి. లక్నో, ఢిల్లీకి రన్ రేట్ ఆల్రడీ తక్కువ కాబట్టి, వాటికి దాదాపు ప్లే ఆఫ్ అవకాశాలు లేనట్టే అంటున్నారు. ఒకవేళ లక్నో ఏమైనా అద్భుతాలు చేస్తేనే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి గందరగోళం మధ్య హైదరాబాద్ వెళ్లదు, ఆర్సీబీ వెళుతుందని హర్భజన్ ఎలా చెబుతున్నాడని నెటిజన్లు తెగ ఆలోచించేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News