BigTV English
Advertisement

Dhanush: రెండేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి ధనుష్.. హిట్ కాంబో రిపీట్..

Dhanush: రెండేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి ధనుష్.. హిట్ కాంబో రిపీట్..
Dhanush: రెండేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి ధనుష్.. హిట్ కాంబో రిపీట్..


Dhanush: ఒకప్పుడు ఒక భాషా హీరోలు వేరే భాషా పరిశ్రమల్లో నటించడానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఈరోజుల్లో ప్రేక్షకుల అభిమానాన్ని అందుకోవాలంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేయాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అందుకే వేరే భాషల్లో ముందుగా తమ సినిమాలు డబ్ చేస్తూ.. మెల్లగా అక్కడ నేరుగా చిత్రాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారందరికీ కాస్త భిన్నంగా ధనుష్.. ఇప్పటికీ ప్రతీ భాషా పరిశ్రమంలో తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.

ధనుష్ ఒరిజినల్‌గా తమిళ హీరోనే. కానీ తనకు అన్ని భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. మంచి కథ వచ్చిందంటే చాలు.. అది ఏ భాష అని ఆలోచించుకుండా సినిమాలు ఒప్పేసుకుంటాడు ఈ హీరో. అందుకే తన సినిమా విడుదల అవుతుంది అని తెలియగానే.. కేవలం తన నటన కోసం థియేటర్‌కు వెళ్లే అభిమానులను సంపాదించుకున్నాడు. తన యాక్టింగ్‌కు అంత సత్తా ఉంది కాబట్టే హాలీవుడ్ ఆఫర్లు సైతం తనను వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పటికే హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించిన ధనుష్.. మళ్లీ తనకు హిట్లు ఇచ్చిన దర్శకుడితోనే చేతులు కలపడానికి ఒప్పుకున్నాడు.

తమిళంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ.. తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్న సమయంలోనే ధనుష్.. ‘రాంజనా’ అనే హిందీ 
సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆనంద్ ఎల్ రాయ్ లాంటి దర్శకుడితో తన డెబ్యూ జరగడంతో చిత్రం విడుదలకు ముందే హైప్‌ను క్రియేట్ చేసుకుంది. రాంజనా విడుదలకు ముందు ధనుష్.. హిందీ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కాబట్టి పలు విమర్శలు కూడా ఎదుర్కున్నాడు. కానీ విడుదల అయిన తర్వాత సినిమా కమర్షియల్‌ హిట్ కాకపోయినా.. ధనుష్ యాక్టింగ్‌కు ప్రశంసలు వెల్లువెత్తాయి.

రాంజనా కాంబినేషన్‌లోనే ధనుష్ మళ్లీ చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ లాంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకొని ‘అత్రంగి రే’ అని మూవీలో నటించాడు. అందులో కూడా ధనుష్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ చిత్రానికి ధనుష్ సిద్ధమవుతున్నాడు. ‘తేరే ఇష్క్ మే’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంజనా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు. 


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×