BigTV English

Adipurush: ‘ఆదిపురుష్’ రిజల్ట్‌పై కృతి తల్లి రియాక్షన్..

Adipurush: ‘ఆదిపురుష్’ రిజల్ట్‌పై కృతి తల్లి రియాక్షన్..
Adipurush: ‘ఆదిపురుష్’ రిజల్ట్‌పై కృతి తల్లి రియాక్షన్..


Adipurush: ఆదిపురుష్ మూవీ టీమ్ విడుదలకు ముందు ప్రేక్షకులకు ఎన్నో హామీలు ఇచ్చింది. విడుదల తర్వాత కూడా ఈ సినిమా కొందరు ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేసింది. కొందరు మాత్రం ఈ చిత్రాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు మూవీ టీమ్ స్పందించడానికి సిద్దంగా లేదని తెలుస్తోంది. కానీ తాజాగా కృతి సనన్ తల్లి చేసిన పోస్ట్ చూస్తుంటే ఇన్‌డైరెక్ట్‌గా ప్రేక్షకులకు సందేశాన్ని ఇస్తున్నట్టే అనిపిస్తోందని అనుకుంటున్నారు నెటిజన్లు.

రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్.. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకుల్లో మంచి మార్కులే పడ్డాయి. కానీ సినిమాకు సంబంధించిన పలు అంశాలు ప్రేక్షకులను బాగా నిరాశపరిచాయి. దీంతో కొందరు కావాల్సిన దానికంటే ఎక్కువగా నెగిటివిటీని వ్యాప్తి చేస్తున్నారు. దీనికి మూవీ టీమ్ ఏమీ స్పందించలేక మౌనంగా ఉండిపోయింది. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ రైటర్.. కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు మరింత ఆగ్రహం కలిగిస్తున్నాడు.

ఒకటి కాదు, రెండు కాదు.. పలు అంశాల కారణంగా ఆదిపురుష్ టీమ్ తీవ్రమైన చిక్కుల్లో పడిపోయింది. ఇదే సమయంలో సినిమాను స్పెషల్ ప్రీమియర్ షోలో చూసిన కృతి సనన్ తల్లి గీతా సనన్.. ఆదిపురుష్‌పై తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘రాముడి లాంటి దేవుడు సైతం శబరి ఇచ్చిన పండ్లలో ప్రేమను చూశాడు తప్పా అవి సగం తినేసి ఉన్నాయని అనుకోలేదు. అందుకే మనుషులు చేసే తప్పులను దాటి వారు అలా చేయడానికి కారణమేంటో చూడాలి. జై శ్రీరామ్’ అని పోస్ట్ చేసింది. దీనికి కృతి చెల్లెలు నుపూర్ కూడా ‘ఇది కచ్చితంగా నిజం’ అంటూ రియాక్ట్ అయ్యింది.

గీతా సనన్ చేసిన ఈ పోస్ట్ చూస్తుంటే.. ఇది కచ్చితంగా ఆదిపురుష్ రిజల్ట్‌కు సంబంధించినట్టే ఉంది అంటూ నేటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా కొందరు ఫ్యాన్స్ రెస్పాన్స్‌కు ఖుషీ అయిన కృతి కూడా థియేటర్లలో వారు చూపిస్తున్న అభిమానాన్ని వీడియోలుగా పోస్ట్ చేసింది. నటీనటులు నటన, మ్యూజిక్ అంతా బాగున్నా కూడా గ్రాఫిక్స్ విషయంలో మూవీ టీమ్ విఫలం అయ్యింది అంటూ మూవీ క్రిటిక్స్ తన మనసులో మాటను బయటపెడుతున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×