BigTV English

Dhanush: ధనుష్ కు షాక్ ఇచ్చిన నిర్మాతల మండలి.. ఇక నుంచి అవి కట్

Dhanush: ధనుష్  కు షాక్ ఇచ్చిన  నిర్మాతల మండలి.. ఇక నుంచి అవి కట్

Dhanush: గత కొంతకాలంగా తమిళ్ నిర్మాతల మండలి కొన్ని సమస్యలతో సతమవుతున్న విషయం తెల్సిందే. అందులో ముఖ్యమైనది అడ్వాన్స్‌లు తీసుకుని షూటింగ్‌లు పూర్తిచెయ్యకుండా నిర్మాతలను తిప్పిస్తున్న హీరోలు. ఇది హీరోలకు కొత్తేమి కాదు.


శింబు దగ్గర నుంచి ధనుష్ వరకు చాలామంది స్టార్ హీరోలు సినిమాలు చేస్తామని నిర్మాతల దగ్గరనుంచి అడ్వాన్స్ తీసుకోవడం.. ఆ తరువాత షూటింగ్ కు రమ్మంటే రాకుండా వారిని తిప్పించుకోవడం. ఇలానే కొనసాగుతున్న నేపథ్యంలో తమిళ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి ఏ నటీనటులకు అడ్వాన్స్ లు ఇచ్చేది లేదని ఖరాకండీగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆగస్టు 15 నుంచి సినిమా షూటింగ్స్ మొత్తం నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎవరైతే సినిమాలు చేస్తామని అడ్వాన్సులు తీసుకున్నారో ఆ సినిమాలన్నీ పూర్తిచేసిన తరువాతే కొత్త సినిమాలకు సైన్ చేయాలని, లేకపోతే చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


ఇకనుంచి ఒక సినిమా పూర్తి అయ్యాకనే మరో సినిమాకు డేట్స్ ఇవ్వాలని, అడ్వాన్స్ లు ఇక ఇచ్చేది లేదని ఆదేశాలు జారీ చేశారు. ఇక నిర్మాతల మండలి మొత్తం ధనుష్ పై ఫైర్ అయ్యారు. ధనుష్ ఎన్నో సినిమాలకు అడ్వాన్స్ తీసుకొని ఇంకా షూటింగ్స్ ను పూర్తి చేయలేదని, ఇకనుంచి తమ పర్మిషన్ ఉంటేనే ధనుష్ షూటింగ్ చేయాలనీ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ విషయమై ధనుష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

ప్రస్తుతం ధనుష్ రాయన్ సినిమా సక్సెస్ తో మంచి సంతోషంలో ఉన్నాడు. మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఉన్నాకొద్దీ పాజిటివ్ టాక్ ను అందుకుని రికార్డ్ కలక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా తరువాత ధనుష్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాల పరిస్థితి ఏంటి అనేది చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×