E-Paper
Advertisement

Dhanush: లుక్ ఏమో బిచ్చగాడిలా.. టైటిల్ ఏమో ‘కుబేర’.. ఎక్కడో తేడా కొడుతుంది..

Dhanush: లుక్ ఏమో బిచ్చగాడిలా.. టైటిల్ ఏమో ‘కుబేర’.. ఎక్కడో తేడా కొడుతుంది..
Advertisement

dhanush kubera movie update

Dhanush Sekhar Kammula Kubera movie(Cinema news in telugu): శుక్రవారం మహా శివరాత్రి సందర్భంగా టాలీవుడ్ నుంచి వరుస సర్‌ప్రైజ్‌లు వచ్చాయి. కొత్త కొత్త అప్డేట్‌లతో పలు సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, సినిమా అనౌన్స్‌మెంట్‌లను మేకర్స్ పోటీ పడి రిలీజ్ చేశారు.

Advertisement

అందులో బాలయ్య బాబు నటిస్తోన్న ‘ఎన్‌బికే 109’ నుంచి ఫస్ట్ గ్లింప్స్, మంచు విష్ణు ‘కన్నప్ప’ నుంచి ఫస్ట్ లుక్, ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ నుంచి ఫస్ట్ లుక్‌ సహా ఇతర మూవీల నుంచి కూడా అదిరిపోయే అప్డేట్‌లు రిలీజ్ అయ్యాయ. అయితే అందులో ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అప్డేట్ కూడా ఉంది.

ఈ చిత్రానికి గానూ మేకర్స్ తాజాగా టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా ‘కుబేర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. ఈ టైటిల్‌తో పాటు మూవీ గ్లింప్స్ కూడా పంచుకున్నారు.

Advertisement

READ MORE: ఈ రోజు టీవీల్లోకి స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు.. లిస్ట్ ఇదిగో

కాగా ఈ గ్లింప్స్ వీడియో మొదట గౌరీశంకరులను చూపిస్తూ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ధనుష్ ఎంట్రీ ఇస్తాడు. ధనుష్‌‌ పూర్తిగా మాసిపోయిన గడ్డంతో ఓ సింపుల్ డ్రెస్‌లో కనిపించాడు. దీంతో ధనుష్‌ను అలా చూసిన ఫ్యాన్స్ అవక్కావుతున్నారు.

ఇటీవల కెప్టెన్ మిల్లర్‌ మూవీలో ధనుష్ లుక్ అదిరిపోయేలా ఉంటుంది. అంతేకాకుండా అందులో ధనుష్ నటనకి కూడా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అలానే ఇటీవల రివీల్ చేసిన ధనుష్ కొత్త సినిమా ‘రాయన్’ ఫస్ట్ లుక్‌లో కూడా పవర్‌ఫుల్‌గా కనిపించాడు.

అయితే ఇప్పుడు కుబేర అంటూ మరొక కొత్త సినిమాలో ధనుష్‌ని ఇలా చూసే సరికి ఫ్యాన్స్ బాగా డీలా పడిపోయినట్లు తెలుస్తోంది. ఒకరకంగా చూస్తే శేఖర్ కమ్ముల గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇకపోతే ఈ మూవీ పాన్‌ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది.

READ MORE: కల్కి 2898 ADలో ప్రభాస్ న‌యా లుక్, సర్‌ప్రైజ్ గిఫ్ట్

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీలో ధనుష్ లుక్, టైటిల్ రెండూ పరస్పరం విరుద్ధంగా ఉండటం మూవీపై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌లపై సునీల్‌నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు నిర్మిస్తున్నారు.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×