BigTV English

Kalki 2898 AD: కల్కి 2898 ADలో ప్రభాస్ న‌యా లుక్, సర్‌ప్రైజ్ గిఫ్ట్

Kalki 2898 AD: కల్కి 2898 ADలో ప్రభాస్ న‌యా లుక్, సర్‌ప్రైజ్ గిఫ్ట్

Kalki 2898 AD Introducing Bhairava


Kalki 2898 AD Introducing Bhairava: యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘స‌లార్’. ఈ మూవీ బ్లాక్ బ‌స్టర్ హిట్‌ సొంతం చేసుకుంది. ఈ మూవీ త‌ర్వాత ప్రభాస్ నుంచి వ‌స్తున్న మరో మూవీ ‘కల్కి 2898 AD’ పై ప్రపంచ‌వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. భార‌త్‌లోనే తొలి సైన్స్ ఫిక్షన్ ఫాంట‌సీ మూవీగా ఫ్యూచర్ హ్యూమన్ లైఫ్‌ని మన క‌ళ్లకు కట్టినట్లూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేస్తున్న అద్భుత ప్రయోగం. ఇదే మూవీపై ఫ్యాన్స్‌లో స‌ర్వత్రా ఉత్కంఠ‌గా నెలకొంది. క‌ల్కి టీమ్ ఇంత‌కుముందు ప్రభాస్ లుక్‌ని రిలీజ్ చేయ‌గా అద్భుతంగా రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ప్రభాస్ రోల్‌ భైరవ పాత్రను ఇంట్రడ్యూస్ చేసింది. నిజానికి డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నాడో లేదో తెలియదు కానీ.. ఈ లుక్‌లో మాత్రం ప్రభాస్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్‌కి మ‌హాశివ‌రాత్రి కానుకగా అందించారు చిత్రం యూనిట్.

మే 2024న వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ ఆడియెన్స్‌ ముందుకు రాబోతోంది. ‘కల్కి 2898 AD’ ప్రచార హంగామా ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. అంత‌కంత‌కు టీమ్ ఆడియెన్స్‌లో హీట్‌ని పెంచేస్తోంది. గత కొన్ని నెలలుగా మేక‌ర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను విడుదల చేయ‌డంతో ప్రభాస్ అభిమానుల్లో క్యూరియాసిటీ అంత‌కంత‌కు రెట్టింపు అవుతోంది.


ఇటీవల.. ఇటలీ దేశం నుండి బీచ్‌లో ఓ సాంగ్ షూటింగ్‌కి సంబంధించిన రెండు ఫోటోలను తాజాగా విడుదల చేయగా వైరల్ అయిన సంగ‌తి మనందరికి తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ లుక్‌ని, రోల్‌ పేరును చిత్రబృందం అనౌన్స్ చేసింది. ప్రభాస్ ఇందులో డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నాడా లేదా? అన్న దానిపై అంత‌గా క్లారిటీ లేదు.

కానీ.. ప్రభాస్ ఈ లుక్‌లో మాత్రం చాలా వైవిధ్యంగా కనిపిస్తున్నాడు. కాశీ వీధుల్లోంచి వచ్చిన ‘భైరవ’లుక్ ఎంతగానో అబ్బురపరుస్తోంది. ఈ మూవీ భ‌విష్యత్ ప్రపంచం ఆధునిక‌త బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోంది. అందుకు సంబంధించిన సెట‌ప్ కూడా ఈ పోస్టర్‌లో మనకు క్లియర్‌గా క‌నిపిస్తోంది. ప్రభాస్ భైరవగా డాషింగ్‌గా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు.

Read More:ఊరమాస్‌ లుక్‌లో బాలయ్య ఎన్బీకే 109 గ్లింప్స్, ఫ్యాన్స్‌కి పూనకాలే..

అతని డ్రెస్సింగ్ చాలా ప్రత్యేకంగా క‌నిపిస్తోంది. త‌న చేతికి ధ‌రించిన మోడ్రనైజ్డ్ గాజులు హైలెట్‌గా నిలుస్తున్నాయి. మెలి తిరిగిన కండ‌లు..పచ్చబొట్టుతో ఉన్న ప్రభాస్ న‌యా లుక్ అంద‌రినీ షాక్‌కి గురిచేస్తోంది. విడుద‌ల‌య్యే ప్రతి పోస్టర్ ఈ మూవీపై మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి.

ఈ భారీ మూవీ నుండి టీజర్ లేదా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండ‌గా, డిజోర్డ్ స్టోజిలిజ్కోవిచ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అశ్విని దత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిస్టోపియన్ బ్యాక్‌డ్రాప్ చాలా ఆసక్తిని రేకెత్తించాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా ప‌టానీ ఇందులో కీ రోల్స్‌ పోషిస్తున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×