BigTV English

Dhanush: నన్నేం పీ*కలేరు.. నేషనల్ అవార్డు పక్కా.. ట్రోలర్స్ కి ధనుష్ గట్టి కౌంటర్!

Dhanush: నన్నేం పీ*కలేరు.. నేషనల్ అవార్డు పక్కా.. ట్రోలర్స్ కి ధనుష్ గట్టి కౌంటర్!

Dhanush: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తన అద్భుతమైన నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు జాతీయస్థాయిలో పేరు సొంతం చేసుకున్నారు ధనుష్. ఇకపోతే ధనుష్ ను గత కొంతకాలంగా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ సినిమా విడుదలకు దగ్గర పడుతోంది అంటే చాలు లేనిపోని నెగిటివిటీ క్రియేట్ చేసి ఆయన సినిమాపై బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని.. తాజాగా ధనుష్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇస్తూ..” నన్నేం పీ*క*లేరు. ఈసారి కచ్చితంగా నాకు నేషనల్ అవార్డు వస్తుంది”..అంటూ ధీమా వ్యక్తం చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..


ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన ధనుష్..

ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో ధనుష్ హీరోగా, రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా.. నాగార్జున (Nagarjuna) కీలకపాత్ర పోషిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం కుబేర(Kubera). జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ను నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడిన మాటలు.. కొంతమందికి కౌంటర్ గా నిలిచాయి. ఇకపోతే ధనుష్ స్పీచ్ తో అభిమానులు మాత్రం సందడి చేస్తున్నారు. ఇక ఇదే ఈవెంట్లో శేఖర్ కమ్ముల ఇచ్చిన స్పీచ్, నాగార్జున మాట్లాడిన మాటలు కూడా అందరిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ధనుష్ మాట్లాడుతూ.. “నా మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. నా సినిమా రిలీజ్ వస్తోందంటే చాలు ఇలా కొన్ని బ్యాచ్లు వస్తాయి. అయినా అలాంటి నెగిటివిటీ నన్ను ఏమి చేయలేదు. ఎందుకంటే నా అభిమానులు నాకు అండగా ఉన్నారు. దారి తెలియకుండా చీకట్లో వెళుతున్నప్పుడు ఒక అదృష్ట శక్తి మన చేతిని పట్టుకొని నడిపిస్తుంది అని అంటారు. అలా నా చేయి పట్టుకుని నడిపించే వారే నా అభిమానులు. ఈ 23 ఏళ్ల పాటుగా నాతో పాటు కలిసి నడుస్తున్న నా కుటుంబ సభ్యులు.. ఇలా మీరు క్రియేట్ చేసే నెగెటివిటీ ఏమాత్రం పనిచేయదు. పక్కకు వెళ్లి ఆడుకోండి. నా అభిమానుల అండ నాకెప్పుడూ ఉంటుంది. మీరు ఒక ఇటుక కూడా కదల్చలేరు.. నాకు ఈసారి నేషనల్ అవార్డు గ్యారెంటీ” అంటూ ధనుష్ కౌంటర్లు వేశారు.


నయనతార, శివ కార్తికేయన్ ఫ్యాన్స్ కి ధనుష్ ఇన్ డైరెక్ట్ కౌంటర్..

ఇకపోతే ధనుష్ కౌంటర్లు నేరుగా నయనతార (Nayanthara), శివ కార్తికేయన్(Siva Karthikeyan) బ్యాచ్ కి గట్టిగా తగిలింది అంటూ నెటిజన్స్ అనుకుంటున్నారు. మరి వీటిపై ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. మొత్తానికైతే ప్రస్తుతం నయనతార, శివ కార్తికేయన్ అభిమానులే తన సినిమాలపై నెగెటివిటీ క్రియేట్ చేస్తున్నారని, ఇక అలాంటివారు తననేం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే నయనతార నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ తో గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఏకంగా కోర్టు వరకు కూడా వెళ్ళింది ఈ అంశం. అందుకే గత కొన్ని రోజులుగా ధనుష్ వర్సెస్ నయనతార అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×