BigTV English

Kollywood : కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి..

Kollywood : కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి..

Kollywood : ఈమధ్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.. పలువురు ప్రముఖులు మృతి చెందుతున్నారు. తాజాగా తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుండె పోటుతో మరణించారు.. తమిళ నటుడు, డైరెక్టర్ విక్రమ్ సుకుమారన్ కన్నుమూశారు. ఓ ప్రాజెక్టు కోసం ఆయన చెన్నై నుంచి మధురై కి వెళ్తుండగా దారి మధ్యలో గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలను విడిచారని తెలుస్తుంది. ఈయన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో మహేందర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాలకు పని చేశారు. ఆ తర్వాత డైరెక్టర్ గా ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు.. ఆయన మరణ వార్తతో తమిళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. పలువురు హీరోలు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. నేడు ఆయన అంత్యక్రియలకు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం..


డైరెక్టర్ విక్రమ్ సుకుమారన్ సినిమాలు.. 

ఈయన తమిళ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసారు. బాలు మహేంద్ర, వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన విక్రమ్ సుకుమారన్ ఆదివారం రాత్రి కన్నుమూసినట్టుగా సమాచారం. గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. శంతనుతో చేసిన మద యానై కొట్టం, రావణ కొట్టం వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరుని సంపాదించుకున్నారు. అయితే సూరితో సినిమా చేయాలనే ప్లానింగ్‌లో విక్రమ్ ఉన్నారట. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన స్వర్గస్తులయ్యారు..ఆయన చెప్పాల్సిన కథలెన్నో ఇక మరుగున పడినట్టే అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు..


Also Read:Tollywood M టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా..?

తమిళ ఇండస్ట్రీ మంచి డైరెక్టర్ ను కోల్పోయింది..

తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ డైరెక్టర్ ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు. వెట్రి మారన్ లాంటి డైరెక్టర్లు సైతం ఈయనకు అభిమానులుగా మారడం మామూలు విషయం కాదు.. శంతునుతో మద యానై కొట్టం, రావణ కొట్టం వంటి చిత్రాలు తీసి అందరినీ మెప్పించారు. ఈయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మనలో ఒకడిగా మంచి స్నేహితుడుగా ఉండే వ్యక్తి మన మధ్య లేరు అని ఊహించుకోవడం కష్టంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇక హీరో అయిన సూరితో ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీగా ఉన్నారట. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే లోపే ఇలా తిరిగి రాని లోకాలకు విక్రమ్ వెళ్లిపోయారు.. నేడు ఆయన స్వగ్రామంలో జరిగే అంత్యక్రియలకు సినీ హీరోలు, ప్రముఖ నటులు హాజరవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×