BigTV English

Dhanush: ధనుష్ పర్ఫెక్ట్ ప్లాన్… ఏకంగా ఏడాదికి 8 సినిమాలు తీసిన డైరెక్టర్ తోనే…

Dhanush: ధనుష్ పర్ఫెక్ట్ ప్లాన్… ఏకంగా ఏడాదికి 8 సినిమాలు తీసిన డైరెక్టర్ తోనే…

Dhanush: తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగానే కాక, దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ హీరో ధనుష్ తెలుగులోనూ మంచి క్రేజ్ ని సంపాదించారు. ఆయన  తమిళ సినీ రంగంలోనే కాకుండ టాలీవుడ్, బాలీవుడ్ లోనే సత్తా చాటారు. గత సంవత్సరం రాయన్ మూవీ తో ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నారు.ప్రస్తుతం కుబేర మూవీలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో తమిళ్ న్యూ డైరెక్టర్ తో మూవీకి ఓకే చెప్పినట్లు సమాచారం. ధనుష్ నెక్స్ట్ మూవీ గురించి మనము తెలుసుకుందాం..


సూపర్ హిట్ మూవీ అందించిన డైరెక్టర్ తో ధనుష్ మూవీ ..

ధనుష్ నటించిన మూవీస్ తెలుగులో రిలీజ్ చేయడంతో ఇక్కడ అభిమానుల్లోనూ ధనుష్ క్రేజ్ సంపాదించారు. రజనీకాంత్ అల్లుడుగానే కాక మంచి నటుడిగా తనకంటూ తమిళ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ధనుష్ ఓ తమిళ్ డైరెక్టర్ తో మూవీ ఓకే చెప్పినట్లు సమాచారం. ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ తో సక్సెస్ ని అందుకున్న అభిషన్, ధనుష్ కి ఓ స్టోరీ లైన్ చెప్పినట్లు అతను దానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. స్టోరీ ను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి తీసుకురమ్మని ధనుష్ తెలిపినట్లు టాక్. టూరిస్ట్ ఫ్యామిలీ తమిళ్ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అభిషన్ తొలిసారి దర్శకత్వం వహించాడు. మిలియన్ డాలర్ స్టూడియో, ఎంఆర్పి ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో ఏం శశి కుమార్, సిమ్రాన్, ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ తో ధనుష్ నెక్స్ట్ మూవీ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్. ఏది ఏమైనా ధనుష్ అభిషన్ జీవింత్ కాంబోలో వచ్చే మూవీ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.


సూపర్ స్టార్ నుండి ప్రశంసలు ..

ఇక అభిషన్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ ఏప్రిల్ 1న థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది ముఖ్యంగా అభిషేన్ దర్శకత్వం, రోల్డాన్ సంగీతం అలాగే శశికుమార్, సిమ్రాన్ ,కమలేష్ నటనకు ప్రేక్షకుల ఫిదా అని చెప్పొచ్చు.ఈ మూవీకి సూపర్ స్టార్ రజినీకాంత్ నుండి ప్రశంసలు కూడా దక్కాయి. ఈ మూవీ 14 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే అత్యధిక వసూలు సాధించిన ఏడవ తమిళ్ చిత్రంగా నిలిచింది.

నిర్మాతగాను విజయం అందుకున్న ధనుష్ ..

ధనుష్ హీరో గానే కాక నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాజాగా ఆయన రూపొందించిన తమిళ్ మూవీ నిలవుకు ఎన్నాడి కోబం తెలుగు లో జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీగా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ధనుష్ కుబేర మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే, ఈ చిత్రం తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతుంది. ధనుష్ తోకలిసి నాగార్జున నటించనున్నారు. హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కిశేఖర్ కమ్ములా దర్శకత్వం వహిస్తున్నారు.

 

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×