BigTV English

Dhootha Review : క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ దూత.. ఎలా ఉందంటే?

Dhootha Review :  క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ దూత.. ఎలా ఉందంటే?
Dhootha web series review

Dhootha web series review(Movie reviews in telugu):

అక్కినేని హీరో నాగచైతన్య సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లో కూడా తన లక్ ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ యాక్షన్ వెబ్ సిరీస్ లో అతను నటించాడు. దూత అనే క్యాచీ టైటిల్ తో తెరకెక్కించిన ఆ వెబ్ సిరీస్ ఎట్టకేలకు ఈ రోజు స్ట్రీమింగ్ మొదలయింది. మరి ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏమిటో ?ఎలా ఉందో ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ? తెలుసుకుందామా..


వెబ్ సిరీస్: దూత

విడుదల తేదీ : డిసెంబర్ 01, 2023


నటీనటులు: నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్, పశుపతి, రవీంద్ర విజయ్, తరుణ్ భాస్కర్, రోహిణి, అనీష్ కురువిల్లా, తనికెళ్ల భరణి, ఈశ్వరి రావు, రాజా గౌతమ్ 

దర్శకుడు : విక్రమ్ కె కుమార్

నిర్మాతలు: శరత్ మరార్

సంగీతం: ఇషాన్ చాబ్రా

సినిమాటోగ్రఫీ: మికోలాజ్ సైగులా

ఎడిటర్: నవీన్ నూలి

స్ట్రీమింగ్ ప్లాట్ఫారం: అమెజాన్ ప్రైమ్ 

కథ :

సాగర్ (నాగ చైతన్య).. ఒక జర్నలిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టి క్రమంగా చీఫ్ ఎడిటర్ స్థాయికి ఎదుగుతాడు. సక్సెస్ ని ఆనందించే లోపే వరుస విషాదాలు అతన్ని చుట్టుముడతాయి.అతని జీవితంలో జరిగిన సంఘటనలు.. ఇంతకు ముందే కొన్ని వార్తాపత్రికల క్లిప్పింగ్స్ లో ఉన్నట్టు అతను గమనిస్తాడు. ఈ విషాదాలను ముందుగా ఎవరు అంచనా వేశారు? ఇది సాధ్యమేనా? అన్న అనుమానంతో సాగర్ తన వంతు విచారణ మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతను తెలుసుకున్న నిజాలు ఏమిటి? వార్తాపత్రికల క్లిప్పింగ్ వెనక ఉన్న రహస్యాన్ని అతను ఎలా చేదించాడు? ఈ ప్రయాణంలో అతని ఎటువంటి ఆపదలను ఎదుర్కొన్నాడు? తెలుసుకోవాలి అంటే వెంటనే అమెజాన్ ప్రైమ్ లో దూత వెబ్ సిరీస్ చూడండి 

విశ్లేషణ:

మీడియా బ్యాక్ డ్రాప్ తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కథ పాతది.. కానీ కథనం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆద్యంతం ఏమి జరుగుతుందా అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొల్పే విధంగా ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా మలిచారు. ఒక పాత కథని కూడా ఇంత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించొచ్చు అని విక్రమ్ కుమార్ మరొకసారి నిరూపించాడు.

ఫస్ట్ ఎపిసోడ్ నుంచి దాదాపు ప్రతి ఎపిసోడ్ లో టేకింగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. సస్పెన్స్ హ్యాండిల్ చేయడంతోపాటు విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సీన్స్ ఎంతో బ్యాలెన్స్ గా ప్లాన్ చేశారు. ఎక్కడ ఏది ఎక్స్ట్రా అనిపించకుండా స్మూత్ గా ఉంది. క్రైమ్ సన్నివేశాలతో పాటు డెత్ సీన్స్ లో కూడా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తగ్గకుండా మెయింటైన్ చేశారు. దూత వెబ్ సిరీస్ ద్వారా ఓ మంచి మెసేజ్ ను డైరెక్టర్ సొసైటీ కి అందించాడు. నాగచైతన్య తొలి వెబ్ సిరీస్ అయినప్పటికీ ఎంతో పర్ఫెక్ట్ గా నటించాడు.

అతని క్యారెక్టర్ లో ఉన్న రెండు షేడ్స్ ని ఎక్కడ ఓవర్ లాప్ కాకుండా సూపర్ గా పెర్ఫార్మ్ చేశాడు. అటు ఫ్యామిలీని ఇటు ప్రొఫెషన్ ను బ్యాలెన్స్ చేసే వ్యక్తిగా అతని తపన, నటన అద్భుతంగా ఉన్నాయి.పార్వతి తిరువోతు కూడా తన పాత్ర మేరకు అద్భుతంగా నటించింది. మిగిలిన అందరు నటులు తమ పాత్రలో బాగా సెట్ అయ్యారు. సిరీస్ లో ఎక్కువగా వర్షపు నేపథ్యం ఆడియన్స్ కి చాలా కొత్త అనుభవాన్ని అందిస్తుంది. ఒకప్పటి గ్యాంగ్స్టర్ మూవీస్ లో.. ఇలాంటి రెయిన్.. డల్ సీన్స్ మనం ఎక్కువగా చూసి ఉంటాము. సీన్స్ డిమ్ గా ఉన్న వాటి ఎఫెక్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉంది. పాత అనుభవాన్ని కొత్త తరహాలో ఈ వెబ్ సిరీస్ తిరిగి ఆవిష్కరించింది.

చివరి మాట:

నాగచైతన్య, విక్రమ్ కుమార్ క్రేజీ కాంబో లో తెరకెక్కిన దూత.. మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఆకట్టుకుంటుంది. పాత కథలు అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగా డైరెక్టర్ నడిపించిన తీరు మెచ్చుకోదగినది. మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్స్ నచ్చే వాళ్లకు ఈ వీకెండ్ దూత మంచి ఫిస్ట్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×