E-Paper
Advertisement

Trisha: రేటు పెంచిన సీనియర్ బ్యూటీ.. మెగాస్టారే కారణం.. ?

Trisha: రేటు పెంచిన సీనియర్ బ్యూటీ.. మెగాస్టారే కారణం.. ?
Advertisement


Trisha: ప్రస్తుతం సీనియర్ తారల హవా నడుస్తోంది. అనుష్క, నయనతార, త్రిష.. ఇలా ముద్దుగుమ్మలు మరోసారి తమ సత్తా చాటుతున్నారు.  ఇక ఈ మధ్యకాలంలో త్రిష పేరు గట్టిగా వినిపిస్తుంది. లియో సినిమా తరువాత అమ్మడు తెలుగులో విశ్వంభరతో రీ ఎంట్రీ ఇస్తుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. గత కొంతకాలంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుంది. పొన్నియన్ సెల్వన్ తో త్రిష మరోసారి తెలుగు అభిమానులకు చేరువైంది. ఇక ఇప్పుడు చిరంజీవి పక్కన నటిస్తూ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది.

బింబిసారతో మంచి హిట్ అందుకున్న వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే.. గత కొన్నిరోజులుగా త్రిష రెమ్యూనిరేషన్ పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా నయన్ కన్నా ఎక్కువే డిమాండ్ చేస్తుందని టాక్ నడుస్తోంది. సీనియర్ హీరోయిన్స్ లో టాప్ రెమ్యూనిరేషన్ అందుకుంటున్న బ్యూటీ నయన్. ఒక్కో సినిమాకు ఆమె.. దాదాపు రూ.15 కోట్లు డిమాండ్ చేస్తుందని అంటున్నారు.

Advertisement

ఇక ఇప్పుడు త్రిష.. రూ. 12 నుంచి 13 వరకు డిమాండ్ చేస్తుందని చెప్పుకొస్తున్నారు. సౌత్ లో అంత ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ త్రిష అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. లియోకు త్రిష కేవలం రూ. 6 కోట్లు మాత్రమే అందుకుంది. ఈ సినిమా తరువాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశం రావడంతో.. అమాంతం ఈ చిన్నది రేటు పెంచిందంట. తెలుగులో చిరు సరసన నటించడం ఒక కారణం అయితే.. తమిళ్ లో కమల్ హాసన్ సరసన థగ్ లైఫ్ లో నటిస్తోంది. ఇక మలయాళంలో మెగాస్టార్ మోహన్ లాల్ సరసన నటిస్తోంది. ఇంతమంది స్టార్స్ సరసన నటించడం అంటే మాటలు కాదు. త్రిష ప్లేస్ లో ఏ హీరోయిన్ ఉన్నా.. ఇలాంటప్పుడే మార్కెట్ ను పెంచేసుకుంటారు. ప్రస్తుతం త్రిష కూడా అదే చేస్తుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం త్రిషకు అంత ఇవ్వాలంటే జంకుతున్నారని టాక్. మరి ఇందులో ఎంత నిజమున్నది అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×