Big Stories

Chandrababu: “టీడీపీ డీఎన్ఏలోనే బీసీ ఉంది.. వైసీపీ పెత్తందారుల పార్టీ”..

Chandrababu

- Advertisement -

Chandrababu: మండుటెండలోనూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎమ్మిగనూరులో ప్రజాగళం సభలో పాల్గొన్నారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్ అని విమర్శించారు. వైసీపీలో ఒకే వర్గానికి 48 సీట్లు ఇచ్చారని మండిపడ్డారు. వైసీపీని పెత్తందారుల పార్టీగా పేర్కొన్నారు.

- Advertisement -

టీడీపీ డీఎన్ఏలోనే బీసీ ఉందని చంద్రబాబు స్పష్టంచేశారు. ఎన్టీఆర్ సామాజిక విప్లవం ప్రారంభించారని తెలిపారు. అన్ని వర్గాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చామన్నారు. తెలుగు దేశం పేదల పక్షం అని పేర్కొన్నారు. తాను ప్రజలతోనే ఉంటానని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీతో తాత్కాలిక పొత్తు అంటూ తన పేరుతోనే లేఖ సృష్టించి సోషల్ మీడియాలో సర్కులేట్ చేసిందని ఆరోపించారు.

టీడీపీ అధికారంలోకి రాగానే బీసీల కోసం చేపట్టే కార్యక్రమాలను చంద్రబాబు వివరించారు. వెనుకబడిన వర్గాల కోసం రూ. 1.5 లక్షల కోట్లతో సబ్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. కులగణన చేపడతామని ప్రకటించారు. జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. కురబలను ఎస్సీల్లో చేరుస్తామని ప్రకటించారు. అలాగే బోయలను ఎస్టీల్లో చేరుస్తామని చెప్పారు. ఎమ్మిగనూరులో టైక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read: టిడిపికి ఈ సారి డూ ఆర్ డై! మరి బాబు ప్లాన్ ఏంటి?

వైసీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టలేదని చంద్రబాబు విమర్శించారు. రాయలసీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేశారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ దశ, దిశను మారుస్తామని భరోసా కల్పించారు. వైసీపీకి ఓటు వేస్తే తలపై చెత్త వేసుకున్నట్లేనని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News