Rashmika Mandanna : ఆ హీరోతో రష్మిక దీపావళీ సెలబ్రేషన్స్ .. ఫోటోలు వైరల్..

Rashmika Mandanna : ఆ హీరోతో రష్మిక దీపావళీ సెలబ్రేషన్స్ .. ఫోటోలు వైరల్..

Rashmika Mandanna
Share this post with your friends

Rashmika Mandanna

Rashmika Mandanna : సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు మంచి ఫ్రెండ్స్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మరికొంతమంది మధ్య లవ్ ట్రాక్ లు నడవడం దగ్గర నుంచి రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. అలా కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మధ్య లవ్ ట్రాక్ నడుస్తోంది అని ప్రచారం ఉంది. గీతా గోవిందం టైం నుంచి ఈ రీల్ పెయిర్.. రియల్ పెయిర్ అయితే బాగుండు అని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఛలో మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో చాలా కొద్ది కాలంలోనే మంచి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. మరొకవైపు పెళ్లి చూపులు మూవీతో హీరోగా ఎంటర్ అయిన విజయ్ దేవరకొండ కొద్ది సినిమాలకే స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇద్దరి కాంబినేషన్లో గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాలు వచ్చాయి. ఆన్ స్క్రీన్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. పైగా ఇద్దరూ కలిసి తరచూ పర్సనల్ టూర్లకు వెళ్లడం.. ఆ పిక్స్ వైరల్ అవ్వడంతో ఇద్దరికీ పెళ్లి కూడా ఫిక్స్ అయింది అన్న టాక్ కూడా వినిపిస్తోంది.

వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్ళిద్దరూ కలిసి దీపావళి పండుగ చేసుకున్నారు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ అసలు ఆ విషయమేమిటో తెలుసుకుందాం.

దీపావళి సందర్భంగా తన కుటుంబంతో పండుగను జరుపుకున్న విజయ్ అభిమానులకు దివాళి విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేశాడు. అలాగే రష్మిక కూడా దీపావళి పండుగ ఫోటోలను షేర్ చేసింది. అయితే అందులో ఏముంది అనుకుంటున్నారా.. ఇద్దరు ఒకే క్యాప్షన్ పెట్టడం.. ఫాన్స్ కి అనుమానం కలగడంతో.. ఆ ఫోటోలను బాగా క్లోజప్ లో పరిశీలించి.. ఇద్దరూ కలిసి విజయ్ వాళ్ళ ఇంట్లోనే దీపావళి చేసుకున్నారు అంటూ ఆధారాలతో సహా ఆన్ లైన్ లో హడావిడి చేస్తున్నారు.

అసలు మ్యాటర్ ఏమిటంటే.. మొదట తన ఇన్స్టాలో దీపావళి విషెస్ చెబుతూ హ్యాపీ దివాలీ మై లవ్స్ అనే క్యాప్షన్ తో రష్మిక సంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని ఓ బెంచ్ పై కూర్చున్న ఫోటోని షేర్ చేసింది. ఆ తర్వాత కాసేపటికి విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ పిక్స్ ని దీపావళి విషెస్ తో పాటు షేర్ చేస్తూ సేమ్ క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఆరా తీయడం మొదలుపెట్టిన ఫ్యాన్స్ రష్మిక ఫోటోలో ఉన్న గోడలను.. విజయ్ ఇంటి గోడలను కంపేర్ చేసి రెండు ఒకటే అని తేల్చేశారు. విజయ్ తోనే కలిసి రష్మిక దీపావళి సెలబ్రేట్ చేసుకుంది అని కూడా ఫిక్స్ అయిపోయారు. 


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Mrunal Thakur: గ్లామ‌ర్ గేట్లు ఎత్తేసిన మృణాల్ ఠాకూర్‌.. సోష‌ల్ మీడియా షేక్‌

Bigtv Digital

Niharika Divorce: నిహారిక జంటకు విడాకులు.. సుప్రీంకోర్టు తీర్పు మేరకు మంజూరు!

Bigtv Digital

ED Notice : నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ నోటీసులు.. ఆంతర్యం అదేనా ?

Bigtv Digital

Salaar: ‘సలార్’కి శ్రుతి హాసన్ బై బై

Bigtv Digital

Ashu Reddy: అషూరెడ్డికి ‘మాన్షన్ హౌజ్’ గిఫ్ట్.. ఇచ్చింది ఎవరో తెలిస్తే షాక్..

Bigtv Digital

NTR 30 Rumors : NTR 30 రూమర్స్‌పై మేకర్స్ క్లారిటీ.. స్టార్ టెక్నీషియన్స్ రంగంలోకి

BigTv Desk

Leave a Comment