Venkatesh Assets: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దొరికిన ఆణిముత్యాలలో విక్టరీ వెంకటేష్(Venkatesh) కూడా ఒకరు. లెజెండ్రీ నిర్మాత దివంగత డి.రామానాయుడు(D.Ramanaidu) చిన్న కొడుకుగా కలియుగ పాండవులు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు. వెంకటేష్ విషయానికి వస్తే. 1960 డిసెంబర్ 13వ తేదీన జన్మించిన ఈయన ఈరోజు 64వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
అయిష్టంగానే ఇండస్ట్రీలోకి కానీ స్టార్ స్టేటస్..
విక్టరీ వెంకటేష్ సినీ ఇండస్ట్రీలోకి అయిష్టంగానే వచ్చారు. అసలు విషయంలోకి వెళ్తే.. నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు వెంకటేష్ తండ్రి నిర్మాత డి.రామానాయుడు. ఆయన ఒక సినిమా చేస్తున్న సమయంలో చివరి క్షణంలో హీరో హ్యాండ్ ఇవ్వడంతో వెంటనే విదేశాలలో చదువుతున్న తన కొడుకు వెంకటేష్ ని అర్జెంట్ గా పిలిపించి హీరోని చేశాడు. అలా హీరో అయిపోయారు వెంకీ. ఒకవేళ హీరో కాకపోయి ఉండి ఉంటే ఈయనను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనకంటూ ఒక మార్క్ చూపించుకున్నారు. ముఖ్యంగా అగ్ర హీరోల్లో ఒకరిగా లక్షలాది మంది అభిమానులు ఆరాధించే హీరోగా, ముఖ్యంగా ఆడవారి ఫేవరెట్ హీరోగా మారిపోయారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరైన వెంకటేష్ ప్రస్తుతం రామానాయుడు స్టూడియోకి, బ్యానర్ కి ఒక ఫోకస్ పాయింట్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
పోటీని తట్టుకొని స్టార్ స్టేటస్..
ముఖ్యంగా తమ బ్యానర్ లోనే ఎన్నో సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. దాంతో తిరుగులేని స్టార్ హీరోగా టాలీవుడ్ లో పేరు దక్కించుకున్నారు. అంతేకాదు అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరో కూడా ఈయనే కావడం గమనార్హం. ముఖ్యంగా చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna), నాగార్జున(Nagarjuna)వంటి దిగ్గజ హీరోల పోటీ కూడా తట్టుకొని ఒక సపరేట్ ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇకపోతే ఆయన ఆస్తుల లెక్కలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
వేలకోట్లకు అధిపతి అయిన వెంకటేష్..
అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ లోనే అత్యంత ధనవంతుడిగా పేరు దక్కించుకున్నారు వెంకటేష్. తండ్రి నుంచి రూ.1000 కోట్లకు పైగా ఆస్తులు వారసత్వంగా పొందిన ఈయన, తన సంపాదనలో మరో రూ.1200 కోట్లు దాచి పెట్టాడని సమాచారం. నాగార్జున తర్వాత టాలీవుడ్ లో రెండో అతిపెద్ద సంపన్నుడిగా నిలిచారు వెంకటేష్. హైదరాబాదులో వెంకీకి ఒక లగ్జరీ హోం కూడా ఉంది. అది కోట్ల విలువ చేస్తుందట. దీంతో పాటు రామానాయుడు స్టూడియో ప్రొడక్షన్ సంస్థలు కూడా ఉన్నాయి. ఇక వైజాగ్లో ఒక స్టూడియో, హైదరాబాదులో రెండు స్టూడియోలు వీరి సొంతం. అంతేకాదు లగ్జరీ కార్లు, బైకులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెడతారు వెంకటేష్. అలా వందల ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక చెన్నైతోపాటు హైదరాబాద్ వంటి మహానగరాలలో భూములు ఉన్నాయి. ముఖ్యంగా తన అన్న, నిర్మాత సురేష్ బాబు (Suresh Babu) తో కలిసి పెట్టుబడులు పెట్టారని, కలిసే వాటన్నింటినీ మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వ్యాపారాలలో భాగస్వాములుగా ఉన్నా.. ఎవరి ఆస్తులు వాళ్ళవేనని, అలా రెండు వేల కోట్లకు పైగానే వెంకటేష్ ఆస్తి ఉంటుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ వెంకటేష్ ఆస్తుల విలువ వైరల్ గా మారుతూ ఉంటుంది.