Kissik Talks Promo : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టాప్ తెలుగు న్యూస్ ఛానెల్స్ లలో ఒకటి బిగ్ టీవీ. ప్రజలకు నిరంతరం వార్తలను అందించడం మాత్రమే కాదు.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడంలో ముందు ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ప్రోగ్రామ్ లను అందిస్తుంది. రీసెంట్ గా ఈ ఛానెల్ కిస్సిక్ టాక్ షోను స్టార్ట్ చేశారు.. ఈ షో ని స్టార్ట్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు, సీరియల్ నటీనటులు పాల్గొన్నారు.. తమ పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ షో తర్వాత ఆ సెలబ్రిటీల లైఫ్ మారిపోయింది అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అలాంటి క్రేజ్ ఉన్న ఈ షో కి తాజాగా టాలీవుడ్ కమెడియన్ మహేష్ విట్టా గెస్టుగా వచ్చారు. ఈ మధ్య సినిమాల్లో కనిపించకపోవడానికి కారణాలను బయటపెట్టారు. తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఫన్ బకెట్ షో ద్వారా బాగా ఫేమస్ అయిన కమెడియన్లలో మహేష్ విట్టా ఒకరు. ఈయన గురించి చెప్పాలంటే ముందుగా ఆయన స్లాంగ్ బాగా ఫేమస్ అయిందని చెప్పాలి. అలా తన స్లాంగ్ తో కమెడియన్ గా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు.. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ షేర్ చేసుకున్నారు. పేరుకు మంచి కమెడియన్ అయిన కూడా ప్రేమ విషయంలో నిరీక్షణ తప్పలేదు. ఇండస్ట్రీ అమ్మాయిని కాకుండా వేరే రాష్ట్రంలోని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈయన ప్రేమ విషయం దాదాపు 8 ఏళ్ల సాగిందని తాజాగా బయటపెట్టారు. 8 ఏళ్లు ప్రేమించి ఫైనల్ గా నువ్వు మా అమ్మ లాగా ఉన్నావు పెళ్లి చేసుకుందాం అని అడిగినట్టు ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. అలా మహేష్ విట్టా ప్రేమ పెళ్లి పీటలు ఎక్కింది. తన భార్యకు కోపం వస్తే సారీ చెప్తాను అని కూడా మొహమాటం లేకుండా బయటపెట్టారు మహేష్ విట్టా..
కమెడియన్ గా మహేష్ విట్టా ఎన్నో సినిమాల్లో నటించారు. తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. స్టార్ హీరోలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్ విట్టా.. సినిమాలు మాత్రమే కాదు అటు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో కూడా ఈయన సందడి చేశారు.. ఇక టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా మహేష్ విట్టా పాల్గొన్నారు. ఇంత ఫేమస్ అయిన ఆయన తనకు సొంత ఇల్లు లేదన్న విషయాన్ని బయట పెట్టారు. కిస్సిక్ టాక్ షోలో యాంకర్ వర్ష మీకు కోట్లు దొరికితే ఏం చేస్తారు అని అడుగుతుంది.. ఒకవేళ నాకు నిజంగానే కోట్లు దొరికితే నేను ముందు సొంతంగా ఇల్లు కట్టుకుంటాను అని మహేష్ విట్టా అంటారు.. ఇంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా సొంత ఇల్లు లేదమ్మా విషయాన్ని బయట పెట్టారు మహేష్. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. సినిమాలు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను మహేష్ విట్టా పంచుకున్నారు. అయినా ఏం చెప్పారో తెలుసుకోవాలంటే కచ్చితంగా ఏపిసొడ్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..