BigTV English

Dil Raju: ప‌వ‌న్‌, మ‌హేష్ వ‌ల్ల దిల్‌రాజు న‌ష్ట‌పోయారా?

Dil Raju: ప‌వ‌న్‌, మ‌హేష్ వ‌ల్ల దిల్‌రాజు న‌ష్ట‌పోయారా?

Dil Raju: ఏ ఇండ‌స్ట్రీ అయినా స‌క్సెస్ చుట్టూనే ఉంటుంది. స‌క్సెస్ గురించే మాట్లాడుతుంది. స‌క్సెస్ మీదున్న వాళ్ల మీదే మ‌రింత ఫోక‌స్ చేస్తుంది. స‌క్సెస్ లేక‌పోతే ప‌ట్టించుకోదు. ఒక‌వేళ స‌క్సెస్‌ఫుల్ పీపుల్ ఉన్నా స‌రే, వాళ్ల ఫెయిల్యూర్స్ మీద కూడా పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌దు. ఈ విష‌యాన్నే ఓపెన్‌గా ఓ ఇంట‌ర్వ్యూ లో చెప్పారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు. డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఫెయిల్యూర్‌లు చ‌విచూసి, త‌ర్వాత త‌ట్టుకుని నిలుచుని, ఆ త‌ర్వాత ప్రొడ్యూస‌ర్‌గా మారి, మ‌ళ్లీ డిస్ట్రీబ్యూట‌ర్‌గా స‌క్సెస్ అయి, ఇప్పుడు ప్యాన్ ఇండియా ప్రొడ్యూస‌ర్‌గా పాతికేళ్ల ప్ర‌స్థానాన్ని గుర్తుచేసుకున్నారు దిల్‌రాజు.


సినిమా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్‌ని గెస్ చేయ‌గ‌లిగిన‌వాడు, డేర్ చేయ‌గ‌లిగిన‌వాడే మ‌గాడు అని అంటారు దిల్‌రాజు. తాను అలాగే చేశాన‌ని చెబుతారు. ఓ వైపు నిర్మాత‌గా అర‌డ‌జ‌ను సినిమాల స‌క్సెస్‌ని చూసిన దిల్‌రాజు, అదే ఏడాది ప‌వ‌న్ క‌ల్యాణ్ అజ్ఞాత‌వాసి, మ‌హేష్‌బాబు స్పైడ‌ర్‌తో విప‌రీత‌మైన న‌ష్టాల‌ను చ‌విచూడాల్సి వ‌చ్చింది. అదే మ‌రో సాదాసీదా డిస్ట్రిబ్యూటర్‌కి వ‌చ్చి ఉంటే త‌ట్టుకోలేక సూసైడ్ చేసుకునేవాడ‌ని, లేకుంటే ఇండ‌స్ట్రీ వ‌దిలేసి పారిపోయేవాడ‌న్న‌ది దిల్‌రాజు చెప్పిన మాట‌. అంతే కాదు, పాతికేళ్ల త‌ర్వాత త‌ను త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బోల్డ్ గా చెప్పాల‌ని డిసైడ్ అయ్యాన‌ని అంటున్నారు దిల్‌రాజు. ఇక‌పై ఇలాగే మాట్లాడుతాన‌ని చెబుతున్నారు.

రీసెంట్‌గా అజిత్‌క‌న్నా విజ‌య్ పెద్ద హీరో అని చెప్పి వివాదానికి తెర‌లేపారు దిల్‌రాజు. ఇప్ప‌టికీ తాను అదే మాట‌కి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని, థియేట్రిక‌ల్ బిజినెస్‌లో ఎవ‌రికి క‌లెక్ష‌న్లు ఎక్కువ‌గా వ‌స్తే వాళ్లే పెద్ద హీరోల‌ని, టాక్‌తో సంబంధం లేకుండా వ‌సూళ్లు తెచ్చుకోగ‌లిగిన వాళ్లే పెద్ద హీరోల‌ని, ఆ లెక్క‌న విజ‌య్ పెద్ద హీరోనేన‌ని అన్నారు. మ‌రి టాక్‌తో సంబంధం లేకుండా ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి, మ‌హేష్ స్పైడ‌ర్ క‌లెక్ట్ చేయ‌లేక‌పోయాయా? వాళ్లు పెద్ద హీరోలు కాదా? అనేది మ‌రికొంద‌రి ధ‌ర్మ‌సందేహం.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×