Rukshar dhillon : దిల్ రూబా హీరోయిన్ రుక్సార్ దిలాన్ ఫొటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేసింది. ఈ సినిమా వచ్చే వారం విడుదల కానుంది. ఇవాళ హైదరాబాద్ లో సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. అయితే, ఇప్పుడు ఈ సినిమా రుక్సార్ గురించి కంటే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
అందుకు కారణం – “దిల్ రూబా” ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె ఫొటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేయడమే. “నాకు కంఫర్ట్ లేకపోయినా ఫొటోలు తీయాలనుకుంటారా? ఇక్కడున్న అమ్మాయిలూ, మీరు ఇందుకు అనుమతి ఇస్తారా?” అంటూ ఆమె అసంతృప్తిని బయటపెట్టింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఏం జరిగింది?
“దిల్ రూబా” ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఫొటోగ్రాఫర్లు రుక్సార్‌ను కొన్ని ప్రత్యేకమైన పోజులు ఇవ్వమని కోరారు. ఇది సాధారణంగా ప్రతి ప్రెస్ మీట్‌లో జరిగే విషయం. హీరోయిన్లు ఫొటోగ్రాఫర్లకు పోజులు ఇస్తారు, ఫోటోలు పబ్లిసిటీ కోసమే అనుకోవచ్చు. కానీ రుక్సార్ మాత్రం దీనికి సహకరించలేదు.
ఆమె “ఈ డ్రస్‌లో నాకు కంఫర్ట్ ఉండదు, పోజులు ఇవ్వను” అని చెప్పింది. దీంతో ఫొటోగ్రాఫర్లు అసహనం వ్యక్తం చేశారు. తర్వాత గ్రూప్ ఫోటో తీస్తున్న సమయంలో రుక్సార్‌ను తప్పించేశారు. దీంతో “మీరు నన్ను కవర్ చేయనట్లయితే నేనూ మాట్లాడతాను” అంటూ ఆమె అసహనం బయటపెట్టింది.
ఫొటోగ్రాఫర్ల వాదన
ఫొటోగ్రాఫర్ల వెర్షన్ మరోలా ఉంది. ఇది కొత్త విషయం కాదు – ఇంతకు ముందు కూడా రుక్సార్ ఇలా ప్రవర్తించిందని చెబుతున్నారు. మీడియా ఈవెంట్‌కి వస్తే, సినిమాకు పబ్లిసిటీ ఇవ్వడానికే వస్తుంది. అయితే, హీరోయిన్లు తమకు కవరేజ్ వద్దని చెబితే, మేమూ వాళ్ల ఫోటోలు తీయాల్సిన అవసరం లేదని కొందరు ఫొటోగ్రాఫర్లు అంటున్నారు.
ఇప్పటికే రుక్సార్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె తీరుపై కొందరు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు ఇలా ప్రవర్తించడం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అంటున్నారు. ఏదేమైనా, ఈ చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది!
కాగా, రుక్సార్ పెద్ద విజయాలను అందుకోలేకపోయిన రుక్సార్ థ్రిల్లాన్ తన గ్లామర్‌తో సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోందని సిని వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది.