Rahul Chahar Tattoo: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుకు ( Indian Premier League 2025 Tournament ) సమయం దగ్గర పడుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. మే 25వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. మార్చి 22వ తేదీన రాయల్ చాలెంజర్స్ వర్సెస్ కేకేఆర్ ( Royal Challengers vs KKR) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనున్నట్లు ఇప్పటికే… ప్రకటన చేశారు. అయితే టోర్నమెంట్ కు… 15 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో.. అన్ని జట్లు తమ హోమ్ నగరాలకు వెళుతున్నాయి.
ఒక్కో ప్లేయర్ విడివిడిగా తమ సొంత జట్ల హోమ్ టౌన్ కు వెళ్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ అయిపోగానే…. టీమిండియా ప్లేయర్లు కూడా తమ తమ జట్టులో చేరిపోతారు. అయితే హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ప్లేయర్లు కూడా ఒక్కొక్కరు… ఉప్పల్ స్టేడియానికి వస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్లు ఇప్పటికే ఉప్పల్ గ్రౌండ్లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. తాజాగా ఇషాన్ కిషన్ కూడా…. హైదరాబాద్ జట్టులో చేరిపోయాడు.
ఈ నేపథ్యంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ( Sunrisers Hyderabad team ) సంబంధించిన ఓ ప్లేయర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన యంగ్ ప్లేయర్ రాహుల్ చాహర్ ( Rahul Chahar ) కూడా తాజాగా ఉప్పల్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ కు సంబంధించిన టాటూ తన చేతి పై ఉన్నట్లు… ఓ వీడియో పోస్ట్ చేశాడు. వాస్తవానికి గత ఐపీఎల్ సమయంలోనే… తన చేతికి ఈగల్ సింబల్ టాటూ వేయించుకున్నానని ఈ వీడియోలో రాహుల్ చాహర్ చెప్పడం జరిగింది.
మెగా వేలం ఐపోయేసరికి తనను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసిందని గుర్తు చేసుకున్నాడు. ఇక్కడ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad team ) సింబల్ కూడా ఈగలని… గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇదంతా డెస్టినీ.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దేవుడు నిన్ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కోసం పంపాడు… అందుకే ఇలా జరిగిందంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ఈసారి సన్రైజర్స్ హైదరాబాద్ను ఎలాగైనా గెలిపించేసేయ్… మంచిగా బౌలింగ్ చేయి… నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటూ రాహుల్ చాహర్ ను ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు అభిమానులు. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలంలో… 3.20 కోట్లకు కావ్య పాప…. రాహుల్ చాహర్ ను కొనుగోలు చేయడం జరిగింది. ఇక అటు ఐపిఎల్ 2024 టోర్నమెంట్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ దాకా వెళ్లి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ చేతిలో దారుణంగా ఓడిపోయింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని కసిగా ఉంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">