E-Paper
Advertisement

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ వీక్‌నెస్ అదే, అక్షయ్ కుమార్‌కు అలా చెప్తేనే వింటాడు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ వీక్‌నెస్ అదే, అక్షయ్ కుమార్‌కు అలా చెప్తేనే వింటాడు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

Shah Rukh Khan – Akshay Kumar: కొందరు దర్శకులకు హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ఆ ఫ్రెండ్‌షిప్‌తోనే వారి పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను, ఇష్టాలను, అయిష్టాలను బయటపెట్టేస్తుంటారు. తాజాగా ఒక బాలీవుడ్ డైరెక్టర్ కూడా తనకు ఫ్రెండ్స్ అయిన షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ గురంచి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. వారి పర్సనల్ లైఫ్‌లో వారి గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ వ్యాఖ్యలు చేసిన దర్శకుడు మరెవరో కాదు.. ‘జీరో’, ‘అత్రంగి రే’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన ఆనంద్ ఎల్ రాయ్.

సినిమాలు ఫ్లాప్

Advertisement

బాలీవుడ్‌లో ఇప్పటికీ స్టార్ల స్థానాల్లో వెలిగిపోతున్న హీరోల్లో అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ కూడా ఉంటారు. ఆ ఇద్దరు హీరోలను డైరెక్ట్ చేసిన దర్శకుల్లో ఆనంద్ ఎల్ రాయ్ కూడా ఒకరు. షారుఖ్ ఖాన్‌తో ‘జీరో’ అనే మూవీ తెరకెక్కించినా అది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక అక్షయ్ కుమార్, ఆనంద్ ఎలా రాయ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్రంగి రే’, ‘రక్షా బంధన్’.. రెండూ ఫ్లాపులుగానే నిలిచాయి. వీరి కాంబినేషన్స్‌లో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆ హీరోలతో ఆనంద్ రాయ్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. తాజాగా వారి ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు ఈ సీనియర్ డైరెక్టర్.

Also Read: బాలీవుడ్ బాటపట్టనున్న సూర్య.. హీరోగా కాదు విలన్‌గా ఎంట్రీ!

Advertisement

జీవితాంతం అదే

‘జీరో’ షూటింగ్ సమయంలో తను, షారుఖ్ ఖాన్ మాట్లాడుకుంటున్న ఫోటోను చూపించి అసలు అక్కడ షారుఖ్ ఖాన్‌తో ఏం మాట్లాడుతున్నారు అని ప్రశ్నించగా.. షూటింగ్ తర్వాత ప్లాన్స్ ఏంటి అని మాట్లాడుకుంటున్నామని బయటపెట్టాడు ఆనంద్ ఎల్ రాయ్. ‘‘షారుఖ్ ఖాన్‌క తందూరి చికెన్, కాఫీ, కూల్ డ్రింక్స్ ఇస్తే చాలు.. వాటితోనే జీవితాంతం బ్రతికేస్తాడు. అవి కాకుండా ప్రేమతో ఏది వడ్డించినా తింటాడు’’ అంటూ షారుఖ్ వీక్‌నెస్ గురించి ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జీరో’.. 2018లో విడుదలయ్యి డిశాస్టర్ అయ్యింది. ఇందులో షారుఖ్ సరసన కత్రినా కైఫ్, అనుష్క శర్మ నటించారు.

కష్టపడి సాధించాడు

అక్షయ్ కుమార్ ఆహారపు అలవాట్ల గురించి కూడా చెప్పుకొచ్చాడు ఆనంద్ ఎల్ రాయ్. తనను సెన్సిటివ్ అని, ఎక్కువగా ఫోకస్‌తో ఉండే వ్యక్తి అని ప్రశంసించాడు. ‘‘స్ట్రెయిట్‌గా చెప్పే విషయాలు అక్షయ్ కుమార్‌కు అర్థం కావు. తనకు అన్నీ కాస్త మసాలా యాడ్ చేసి చెప్పాలి. తను చాలా సెన్సిటివ్ కానీ బయటపడడు. తను జీవితంలోని ప్రతీ క్షణాన్ని, తను చేసే ప్రతీ విషయాన్ని ఎంజాయ్ చేయాలనుకునే వ్యక్తి. తను చాలా కష్టపడతాడు, ఫోకస్ చేస్తాడు కాబట్టే తను జీవితంలో అనుకున్న ప్రతీది సాధించాడు. తనను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోలేరు. ఒక వ్యక్తి ఎంత పెద్ద స్టార్ అయినా తన విలువలను మర్చిపోకూడదు’’ అంటూ అక్షయ్ కుమార్ గురించి గొప్పగా మాట్లాడాడు ఆనంద్ ఎల్ రాయ్.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×