BigTV English
Advertisement

Suriya: బాలీవుడ్ బాటపట్టనున్న సూర్య.. హీరోగా కాదు విలన్‌గా ఎంట్రీ!

Suriya: బాలీవుడ్ బాటపట్టనున్న సూర్య.. హీరోగా కాదు విలన్‌గా ఎంట్రీ!

Suriya Bollywood Entry : చాలా మంది తమిళ హీరోలకు తెలుగులో కూడా విపరీతమైన పాపులారిటీ ఉంది. కానీ అందరికంటే ముందు తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయిన తమిళ హీరో సూర్య. ఇప్పటివరకు సూర్య.. కేవలం తమిళ సినిమాల్లో మాత్రమే నటించాడు. ఆయన యాక్టింగ్‌తో మొత్తం సౌత్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. తెలుగులో తనకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ఇప్పటివరకు టాలీవుడ్‌లో స్ట్రెయిట్ సినిమా చేయడానికి ముందుకు రాలేదు సూర్య. అలాంటి హీరో ఇప్పుడు బాలీవుడ్ బాటపట్టనున్నాడని సినీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తన తొలి హిందీ సినిమాలో హీరోగా కాకుండా విలన్‌గా నటించడానికి సిద్ధమయ్యాడట సూర్య.


గ్రీన్ సిగ్నల్

బాలీవుడ్‌లో పలు ఫ్రాంచైజ్ సినిమాలు ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయాయి. అంతే కాకుండా ఈ ఫ్రాంచైజ్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా వాటిని హిట్ చేయడానికి అక్కడి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు. అలాంటి సినిమాల్లో ఒకటి ‘ధూమ్’. ఇప్పటికే ‘ధూమ్’ ఫ్రాంచైజ్‌లో మూడు సినిమాలు వచ్చి ఒకదానికి మించి మరొకటి హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్‌లో నాలుగో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదే సమయంలో ‘ధూమ్ 4’లో సూర్య విలన్‌గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ అటు కోలీవుడ్‌లో, ఇటు బాలీవుడ్‌లో రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ‘ధూమ్ 4’లో విలన్ మాత్రమే కాకుండా హీరోలు కూడా మారనున్నట్టు సమాచారం.


Also Read: మరో బీ టౌన్ బ్యూటీ పాన్ ఇండియా ఎంట్రీ… ప్రభాస్, మహేష్ సినిమాలపైనే కన్ను

డైరెక్టర్ కోసం వేట

ఇప్పటివరకు ‘ధూమ్’ ఫ్రాంచైజ్‌లో జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ లాంటి స్టార్లను చూశారు ప్రేక్షకులు. ఇక 2013లో విడుదలయిన ‘ధూమ్ 3’లో అమీర్ ఖాన్ హీరోగా నటించి మెప్పించాడు. ఈ ఫ్రాంచైజ్‌లో చివరి చిత్రం వచ్చి దాదాపు 11 ఏళ్లు కావడంతో ‘ధూమ్ 4’పై ఫోకస్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. పైగా ఈ మూవీకి ఒక్క డైరెక్టర్ మాత్రమే ఉండడని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. యంగ్ టాలెంట్ అయిన అయాన్ ముఖర్జీని ‘ధూమ్ 4’కు దర్శకుడిగా రంగంలోకి దించాలని నిర్మాతలు అనుకుంటున్నారట. కానీ అయాన్ ముఖర్జీ ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర 2’ వర్క్‌లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

గెస్ట్ రోల్

ఇప్పటివరకు హీరోగానే మెప్పించిన సూర్య.. ఇటీవల తనలోని విలనిజంను కూడా బయటపెట్టాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమ్’ మూవీలో చివర్లో రోలెక్స్ అనే విలన్ పాత్రలో కనిపించి ఒక్కసారి సినిమాపై హైప్ పెంచేశాడు. ఇప్పటికే రోలెక్స్ పాత్రను పూర్తిస్థాయిలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ‘ధూమ్ 4’లో విలన్‌గా ఆయన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త ఫ్యాన్స్‌ను మరింత ఎగ్జైట్ చేస్తోంది. ఇటీవల అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సర్ఫిరా’ మూవీతో నిర్మాతగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సూర్య. అంతే కాకుండా అందులో ఒక చిన్న గెస్ట్ రోల్ చేసి హిందీ ఆడియన్స్‌ను మొదటిసారి నేరుగా పలకరించాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×