Meena -Danush: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన వారిలో సీనియర్ నటి మీనా(Meena) ఒకరు. ఈమె బాలనటి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం అతి చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన సినిమా అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలలో అగ్ర హీరోలు అందరి సరసన నటిస్తూ ఉన్న మీనా తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. మీనా దంపతులకు ఒక పండంటి కుమార్తె జన్మించింది.
ఇలా తన భర్త కూతురితో ఎంతో సంతోషంగా గడుపుతున్న మీనా తన కుమార్తె కాస్త పెద్ద అవగానే తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇలా పలు సినిమాలలో తల్లి పాత్రలలోను, వదిన, అక్క పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్న తరుణంలో ఈమె భర్త విద్యాసాగర్ (Vidya Sagar)అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఇలా ఉన్నఫలంగా తన భర్త మరణం ఆమెను ఎంతగానో కృంగదీసింది. ఇలా భర్తను పోగొట్టుకున్న బాధలు ఉన్న మీనాకు సినీ సెలబ్రిటీలు అందరూ తనకు అండగా నిలిచి ఆమెను మామూలు స్థాయికి తీసుకువచ్చారు. ఇక ప్రస్తుతం మీనా తిరిగి సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీ అవుతున్నారు.
ధనుష్ మీనా రెండో పెళ్లి…
సినిమా ఇండస్ట్రీలో హీరో లేదా హీరోయిన్లు తమ జీవిత భాగస్వామి నుంచి విడిపోయిన లేదా విడాకులు తీసుకున్న వారి రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వినపడుతూనే ఉంటాయి. ఇక మీనా కూడా తన భర్తను కోల్పోవడంతో ఈమె కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని పెద్ద ఎత్తున వార్తలు షికారులు చేశాయి. అంతేకాకుండా మీనా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Danush) ను రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. ఇక హీరో ధనుష్ సైతం తన భార్య ఐశ్వర్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఇలా విడాకులు తీసుకోవడంతో ధనుష్ కూడా మీనాను రెండో పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
మీనా పెళ్లిపై గీతాకృష్ణ కామెంట్స్..
ఇలా మీనా ధనుష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో మీనా ఈ వార్తలపై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమె ఈ వార్తలను ఖండించినప్పటికీ కూడా వీరి పెళ్లి గురించి రూమర్లు మాత్రం ఆగడం లేదు అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ (Geetha Krishna)ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మీనా రెండో పెళ్లి గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మీనా భర్త అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మీనా చిన్నప్పటినుంచి పక్కా కమర్షియల్ , మంచి సినిమాలతో టాప్ రేంజ్ కు వెళ్ళిపోయింది. ఇక ఈమె రెండో పెళ్లి గురించి రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. అయితే త్వరలోనే ఆమె రెండో పెళ్లి జరిగితే జరగొచ్చు అంటూ ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.