ప్రపంచంలో కొన్ని అరుదైన ఘటన జరుగుతుంటాయి. వాటిని ఎంత మర్చిపోవాలని అనకున్నా, మర్చిపోలేం. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన. సాధారణంగా ఎవరైనా ఓ క్రీడాకారుడు చనిపోతే, మిగతా ప్లేయర్స్ అంతా శ్రద్ధాంజలి ఘటించడం చూశాం. అతడి అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటు వీడ్కోలు పలకడం చూశాం. కానీ, ఓ ఫుడ్ బాల్ ప్లేయర్ చనిపోతే, అతడి జట్టు సభ్యులంతా కలిసి చనిపోయిన వ్యక్తితో గోల్ కొట్టించారు. చనిపోయిన వ్యక్తి గోల్ కొట్టడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం ఏంటంటే..
శవ పేటికతో గోల్ కొట్టించిన టీమ్ మెంబర్స్
చిలీకి చెందిన జైమ్ ఎస్కాండర్ (Jaime Escandar) మంచి ఫుట్ బాల్ ప్రేయర్. ఆ దేశం తరఫున ఎన్నో మ్యాచ్ లలో ఆడాడు. 2021లో చనిపోయాడు. మరణానికి కారణాలు ఏంటి అనేది పెద్దగా తెలియదు. కానీ, అతడి స్నేహితులు, అపారిసియన్ డి పైన్ (Aparicion de Paine) జట్టు సభ్యులు తుది వీడ్కోలు పలికేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫుట్ బాల్ కోర్టులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంటియాగో శివార్లలోని హుయెల్క్వెన్ అనే కోర్టులో జైమ్ శవపేటికను తీసుకొచ్చారు. అతడి సహచర ఆటగాడు బంతిని శవపేటిక వైపు తన్నాడు. ఆ బాల్ శవపేటకకు తగిలి నేరుగా గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. ఈ గోల్ ను చూసి అక్కడ ఉన్న ప్రేక్షకులు, జైమ్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. మరి కొందరు బాణసంచా కాల్చారు. జట్టు సభ్యులు గ్రీన్ జెర్సీలు ధరించిన శవపేటిక చుట్టు మోకాళ్ల మీద కౌగిలించుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. లాటిన్ అమెరికా అంతటా ఫుట్ బాల్ అభిమానులను ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంది.
స్వర్గం నుంచి ఆత్మతో గోల్ చేశాడు!
జైమ్ జట్టు సోషల్ మీడియా వేదిగా ఈ వీడియోను షేర్ చేస్తూ ఓ పోస్టు పెట్టింది. “ఇది ఓ చారిత్రకమైన గోల్. ఈ గోల్ ను జాలి, కన్నీళ్లతో కూడిని ఆనందాన్ని ఇచ్చింది. జైమ్ స్వర్గం నుంచి తన ఆత్మతో ఈ గోల్ చేశాడు” అని రాసుకొచ్చింది. చిలీలో జరిగిన ఈ కార్యక్రమంగా ఆయనకు గొప్ప నివాళిని అర్పించిందని నెటిజన్లు రాసుకొచ్చారు.
Read Also: హమ్మయ్య.. ఆ రైలు నెల రోజులకు పొడిగింపు, విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్!
ఎవరీ జైమ్ ఎస్కాండర్?
జైమ్ ఎస్కాండర్ చిలీకి చెందిన ఫుట్ బాల్ ఆటగాడు. అపారిసియన్ డి పైన్ అనే జట్టులో సెంటర్ ఫార్వర్డ్ గా ఆడేవాడు. అతను 2021 డిసెంబర్ 31న మరణించాడు, వయసు 25 సంవత్సరాలు. అతడు ఎందుకు చనిపోయాడు అనేది తెలియదు. కానీ, అతని స్నేహితులు, జట్టు సభ్యులు ప్రత్యేకమైన వీడ్కోలు ఇచ్చారు. నిజంగా ఆయనకు ఫుట్ బాల్ పట్ల ఎంతో ఇష్టం ఉండేదని జట్టు సభ్యులు వెల్లడించారు. ఫుట్ బాల్ లో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన వ్యక్తి అత్యంత తక్కువ వయసులో చనిపోవడం బాధాకరం అన్నారు.
Read Also: అద్భుతం.. ఈ దేశాల్లో రైళ్లు రోడ్లపైనే నడుస్తాయ్, అదెలా?