OTT Movie : తమిళ ఇండస్ట్రీ ఎన్నో మరపురాని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. నటనకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు ఇక్కడి నటులు. డీ గ్లామర్ రోల్ చేయడంలో ఇక్కడి వాళ్ళు ముందు ఉంటారు. అయితే ఇప్పడు మనం చెప్పుకోబోయే సినిమా తమిళంలో ఫుల్ బిజీ గా ఉన్న హాస్య నటుడు యోగి బాబు చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఇతను ఒక మెజీషియన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో ఇతను ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది. అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
దక్షిణ భారతదేశంలోని ఒక టూరిస్ట్ స్పాట్‌లో ఒక మెజీషియన్ (యోగి బాబు) నివసిస్తుంటాడు. తన చనిపోయిన తండ్రి నెరవేరని కలలను సాకారం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే ఇతను తన మెజీషియన్ మాయాజాలం వల్ల సమాజం నుండి నిరంతరం వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. అతని మాయాజాల ప్రదర్శనలను ప్రజలు దూరం పెడతారు. అయినా ఇతను పట్టువదలకుండా తన ఉనికి కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక రోజు ఇతని వల్ల ఒక యాక్సిడెంట్ కారణంగా ఒక బాలుడు గాయపడటంతో, అతను సమాజంలో అసహ్యించుకునే వ్యక్తిగా మారతాడు. ఈ సంఘటన అతన్ని స్థానిక గుండాలతో వివాదంలోకి దించుతుంది. ఒక మర్డర్ ఇతను చేసినట్లు క్రియేట్ చేస్తారు కొంతమంది రౌడీలు.
ఇక ఈ మెజీషియన్ జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. అతన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళపై, తన మాయాజాల నైపుణ్యాలను ఉపయోగించి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు ఈ మెజీషియన్. ఇతను తన విలువను నిరూపించుకోవడానికి ఒక శక్తివంతమైన అవతారం ఎత్తుతాడు. చివరికి ఈ మెజీషియన్ తన మంత్రాలతో పగ తీర్చుకుంటాడా ? అతనికి సమాజంలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ? ఇతనికి ఎటువంటి మ్యాజిక్ లు వస్తాయి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : కూతురు కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చే తండ్రి … మతి పోగొట్టే ఇన్వెస్టిగేషన్ తో మెంటలెక్కించే సినిమా …
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘జోరా కైయా తట్టుంగా’ (Jora Kaiya Thattunga). 2025 లో విడుదలైన ఈ మూవీకి వినీష్ మిల్లెనియం దర్శకత్వం వహించారు. ఇందులో యోగి బాబు, శాంతి రావు, హరీష్ పెరడి, జాకీర్ అలీ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనిని వామా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జాకీర్ అలీ నిర్మించారు. ఈ మూవీ స్టోరీ దక్షిణ భారతదేశంలోని ఒక సన్యాసి మాంత్రికుడి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.