Director Krish:ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించి, ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్న ఈయన ‘వేదం’, ‘కంచె’ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ని కూడా సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఒక సినిమాను తెరకెక్కించే స్టైల్లో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. ఇప్పటికే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి హిస్టారికల్ సినిమాను 80 రోజుల్లోనే పూర్తి చేసిన క్రిష్, ‘ఎన్టీఆర్ బయోపిక్’ రెండు భాగాలను కేవలం 79 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. అటు కరోనా టైం లో కూడా ‘కొండ పొలం’ సినిమాను కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేసి, సరికొత్త రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. ఇంతటి ఘనత సాధించిన డైరెక్టర్ క్రిష్ గత కొంతకాలంగా ట్రాక్ తప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ మూవీ నుంచి తప్పకుండా డైరెక్టర్ క్రిష్..
దీనికి తోడు రీసెంట్ గా డ్రగ్స్ కేసు వ్యవహారంలో కూడా సైలెంట్ అయిపోయారు. అందుకేనేమో ఆయన తన సినిమాలను కూడా సైలెంట్ గా తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం క్రిష్ వ్యవహార శైలి చూస్తూ ఉంటే.. ఇప్పుడు అదే తంతు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని అటు సినీ వర్గాలలో కూడా చర్చలు నడుస్తున్నాయి. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ‘హరిహర వీరమల్లు’ సినిమా చేశారు. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే అనూహ్యంగా మొదట్లోనే దర్శకత్వం నుంచి పలు కారణాలతో సినిమా నుండి తప్పుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి జ్యోతి కృష్ణ (Jyothi Krishna) దర్శకత్వం వహిస్తూ ఉండగా.. సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. మే 30వ తేదీ లోపు సినిమాను విడుదల చేయాలని అటు మేకర్స్ కూడా భావిస్తున్నారు.
అనుష్క ఘాటీ మూవీ నుంచి కూడా తప్పుకున్నారా..?
ఇకపోతే ఈ సినిమా నుండీ తప్పుకున్న డైరెక్టర్ క్రిష్.. అనుష్క శెట్టి(Anushka Shetty)తో ‘ఘాటీ’ సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు (Vikram Prabhu) కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ , స్పెషల్ వీడియో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇకపోతే గతంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో వేశ్యగా నటించి ఆకట్టుకున్న అనుష్క శెట్టి.. ఈ సినిమాతో మళ్లీ గట్టి కం బ్యాక్ ఇస్తుందని అందరూ ఆనుకున్నారు. దీనికి తోడు అటు అనుష్క కూడా సినిమాలను తగ్గించేసింది. చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈమె ఈ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. దీంతో ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఎదురు చూడగా అంతలోనే ఘాటీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతూ ఉండగా ఇప్పుడు ఆ పనుల్లోనే తీవ్ర జాప్యం జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించినా.. రిలీజ్ డేట్ కూడా దాటిపోయింది. కానీ ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. దాంతో ఇప్పుడు ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయిందా..? లేక క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొంతమంది క్రిష్ ఎందుకు ఇలా చేస్తున్నారు..? పవన్ తో సినిమా లాగానే ఇప్పుడు అనుష్క సినిమా నుంచి కూడా తప్పకున్నారా .. ఆయనకు ఏమైంది?
ఇలా ఎందుకు చేస్తున్నారు? అని కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.