BigTV English

Smart Watch: స్టైల్‌గా కనిపించాలని స్మార్ట్ వాచ్ పెట్టుకుంటున్నారా? ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా?

Smart Watch: స్టైల్‌గా కనిపించాలని స్మార్ట్ వాచ్ పెట్టుకుంటున్నారా? ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా?

Smart Watch: ఆధునిక యుగంలో స్మార్ట్ వాచ్‌లు చాలా మంది జీవితంలో భాగమయ్యాయి. ఈ గాడ్జెట్లు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, వ్యాయామం ట్రాక్ చేయడంతో పాటు ఎన్ని గంటలు నిద్రపోతున్నారనే వాటిని మానిటర్ చేస్తుంది. అయితే, స్మార్ట్ వాచ్‌లను అతిగా ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..


చర్మంపై మచ్చలు
స్మార్ట్ వాచ్‌లు చర్మ సమస్యలను కలిగించవచ్చు. ఈ పరికరాలను గంటల తరబడి ధరించడం వల్ల చర్మం గాలి తగలకుండా ఉండి, చెమట, దురద, చర్మం ఎరుపెక్కడం వంటి సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, స్మార్ట్ వాచ్‌ను శుభ్రంగా ఉంచకపోతే బ్యాక్టీరియా పెరిగి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందట. అందుకే, స్మార్ట్ వాచ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, రాత్రి వేళల్లో తీసివేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

బ్లూ లైట్
స్మార్ట్ వాచ్‌ల నుండి వచ్చే నీలి కాంతి కళ్లపై ఒత్తిడిని కలిగిస్తుందట. ఇవి ఎనీ టైం నోటిఫికేషన్లను చూపిస్తాయి. దీని వల్ల కళ్లు అలసిపోయే ఛాన్స్ కూడా ఉందని నిపుణుల చెబుతున్నారు. రాత్రి సమయంలో స్మార్ట్ వాచ్ స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడటం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుందట. నిద్రలేమి సమస్యలు ఎదురైతే, శరీరం ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది రక్తపోటు, గుండె సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


మానసిక అందోళన
స్మార్ట్ వాచ్‌లు మానసిక ఆందోళనను పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ గాడ్జెట్లు హృదయ స్పందన రేటు, కేలరీలు, అడుగుల సంఖ్య వంటి డేటాను నిరంతరం చూపిస్తాయి. ఈ సమాచారం కొందరికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, కొందరు ఈ డేటా గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళనకు గురవుతారు. దీని వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కొందరు స్మార్ట్ వాచ్‌లో చూపించే డేటాపై ఆధారపడి, సహజమైన వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఒకవేళ ఈ రోజు 10,000 అడుగులు నడిచినట్లు స్మార్ట్ వాచ్ చూపిస్తే, వ్యక్తి తగినంత వ్యాయామం చేసినట్లు భావిస్తాడు. శరీరానికి అవసరమైన ఇతర వ్యాయామాలను చేయడం కూడా మరచిపోతాడు. దీని వల్ల బద్దకం కూడా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

స్మార్ట్ వాచ్‌లు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ విడుదల చేస్తాయి. ఈ చిన్న మొత్తంలో ఉన్నప్పటికీ, ఎక్కువ సమయం పాటు ఇవి శరీరంపై పడితే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే ఛాన్స్ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఇంకా స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ, జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×