E-Paper
Advertisement

Prashanth Neel Meets VD: విజయ్ దేవరకొండని కలిసిన ప్రశాంత్ నీల్.. ఓ అదా సంగతి?

Prashanth Neel Meets VD: విజయ్ దేవరకొండని కలిసిన ప్రశాంత్ నీల్.. ఓ అదా సంగతి?
Advertisement

Prashanth Neel Meets Vijay Deverakonda: ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ హీరోగా మారిన వారిలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఒక్క సారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే అంతకముందు ఎన్నో సినిమాలు చేసినా పెద్దగా పేరు రాలేదు. కానీ అర్జున్ రెడ్డితో మాత్రం క్రేజీ హీరోగా మారిపోయాడు.

ఆ తర్వాత వరుస హిట్లతో దూసుకుపోయాడు. అయితే అతడి కెరీర్‌లో బాగా దెబ్బెసిన సినిమా ఏదన్నా ఉందంటే అది ‘లైగర్’ మాత్రమే. ఎంతో భారీ బడ్జెట్‌తో ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మారింది. ఈ సినిమా ఫస్ట్ నుంచే హైప్‌ను క్రియేట్ చేసుకుంది. కానీ హైప్‌కి తగ్గట్టుగా సినిమా లేకపోవడంతో బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది.

Advertisement

ఆ తర్వాత విజయ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి గతేడాదే.. ‘ఖుషీ’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ మూవీ కాస్త పర్వాలేదనిపించుకుంది. ఇక ఈ ఏడాది ‘ఫ్యామిలీ స్టార్’తో వచ్చాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా పర్వాలేదనిపించుకుంది. ఫస్ట్ నుంచి మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రమే బాగా కనెక్ట్ అయింది.

Also Read : ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Advertisement

యూత్ మాత్రం ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ స్టార్ డైరెక్టర్‌ విజయ్‌ని కలవడం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్ 1, 2’, ‘సలార్’ వంటి చిత్రాలతో బాక్సాఫీసును గడగడలాడించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు విజయ్ దేవరకొండను కలవడం హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా ప్రశాంత్ నీల్ హైదరాబాద్‌లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లాడు. ఈ మేరకు విజయ్ మేనేజర్‌తో ప్రశాంత్ నీల్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వీరి మీటింగ్ ఎందుకు జరిగిందో తెలియలేదు.. కానీ ఇందుకు సంబంధించిన వార్త మాత్రం యమ స్పీడ్‌లో చక్కర్లు కొడుతుంది. ప్రశాంత్, విజయ్‌కి మధ్య ఓ మూవీ స్టోరీకి సంబంధించిన డిస్కర్షన్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read: Alia Bhatt: హీరామండీ ప్రీమియర్.. అలియా ధరించిన డ్రెస్ రేటు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.. ?

అయితే మరొక గాసిప్ ఏంటంటే.. ప్రశాంత్ నీల్ చేతిలో ప్రస్తుతం సలార్ 2, ఎన్టీఆర్ 31 సినిమాలు ఉన్నాయి. మరి ఈ రెండింటిలో ఏదో ఒక సినిమా కోసం ప్రశాంత్.. విజయ్‌ని సంప్రదించి ఉంటాడా? అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రశ్నలన్నింటి ఆన్సర్ దొరకాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×