BigTV English
Advertisement

Cadre shock to Ktr: కేటీఆర్, కథ అడ్డం తిరిగింది, పెద్దాయన మాటలు నిజమే?

Cadre shock to Ktr: కేటీఆర్, కథ అడ్డం తిరిగింది, పెద్దాయన మాటలు నిజమే?

Cadre shock to Ktr(Latest political news telangana): బీఆర్ఎస్‌కు నేతలే కాదు, కేడర్ కూడా దూరమవుతుందా? కార్యకర్తలు కూడా వలస పోతున్నారా? పదేళ్ల కేసీఆర్ పాలనలో కార్యకర్తలు విసిగిపోయారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఉపాధక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఊహించని షాక్ ఇచ్చారు ఆ పార్టీ కార్యకర్తలు. అసలేం జరిగింది. ఇంకా లోతుల్లోకి వెళ్తే..


మంగళవారం సాయంత్రం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి కేటీఆర్ కూడా హాజరయ్యారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు రావడంతో కేటీఆర్ ఒకానొక దశలో ఉబ్బితబ్బిబయ్యారు. కాకపోతే కేటీఆర్ ప్రసంగం మొదలైన తర్వాత కార్యకర్తలు అక్కడి నుంచి జారుకోవడం మొదలైంది. ఎప్పుడు మాదిరిగా కాంగ్రెస్‌ను దుమ్మెత్తిపోయడం తప్ప ఇంకా ఏమీ లేదన్నది అక్కడికి వచ్చినవాళ్ల మాట. పదేళ్లగా ఆ మాటలు విని విని చిరాకు వచ్చిందని చెప్పుకొచ్చారు.

కేటీఆర్ ప్రసంగం పూర్తి కాకముందే సగానికిపైగానే గులాబీ కార్యకర్తలు సమావేశం నుండి వెళ్లిపోయారు. సమావేశంలో ఖాళీగా కుర్చీలు దర్శనమిచ్చాయి. అయినా కేటీఆర్ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. సమావేశం పూర్తయిన తర్వాత స్థానిక నేతలపై మండిపడ్డారట కేటీఆర్. మీటింగ్‌ అట్టర్ ఫ్లాప్ చేశారంటూ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. దానికి నాయకులు కూడా సమాధానం చెప్పారట. కార్యకర్తలను సమావేశానికి తీసుకొస్తామని, వాళ్లని కూర్చో బెట్టలేమని, ఉండకపోతే తామేం చేస్తామని కేటీఆర్ వెనుక మాట్లాడుకోవడం నేతల వంతైంది.


ALSO READ: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. విద్యార్థులు చెక్ చేసుకోండిలా..

వారం ముందుకెళ్దాం.. ఇటీవల బీఆర్ఎస్ పార్టీపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. పార్టీపై నేతలకే కాదు.. కార్యకర్తలకు విశ్వాసం పోయిందని అందుకే వెళ్లిపోతున్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా గత పదేళ్లలో నియోజకవర్గాల్లో నేతల పనితీరు కూడా కారణమని తెలిపారు. ఇప్పుడు కేటీఆర్ మీటింగ్‌లోనూ గుత్తా వ్యాఖ్యలను కొందరు నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

 

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×