BigTV English

Tillu Square Collections: టిల్లు గాని డీజే బాక్సాఫీసు వద్ద భలే సౌండ్ వస్తోంది బాసు.. రెండు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..?

Tillu Square Collections: టిల్లు గాని డీజే బాక్సాఫీసు వద్ద భలే సౌండ్ వస్తోంది బాసు.. రెండు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..?
Tillu Square
Tillu Square

Tillu Square 2 Days Collections:టిల్లు స్క్వేర్.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. ‘డీజే టిల్లు పేరు.. వీడి స్టైలే వేరు’ అంటూ ఫస్ట్ పార్ట్‌తో వచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’తో తన డీజే సౌండ్‌ను గట్టిగా కొట్టాడు. బాక్సాఫీసు వద్ద డీజే సౌండ్ మోత మోగించేస్తున్నాడు టిల్లుగాడు. మరి ఈ సినిమా రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం..


మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ మూవీలో యంగ్ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించి అదరగొట్టేసింది. ఎన్నో అంచనాల నడు మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇక ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకాభిమానులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు.

దీంతో ఈ మూవీకి ఫస్ట్ డే కళ్లు చెదిరే కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.23.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అబ్బుపరచింది. ఒక చిన్న సినిమాగా.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఫస్ట్ రోజే ఇంత పెద్దమొత్తంలో కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు.


Also Read: మన్నారా చోప్రా బర్త్ డే వేడుకల్లో ప్రియాంక చోప్రా – నిక్ జోనస్.. వీడియో వైరల్

అయితే యూఎస్‌లో కూడా ఈ మూవీ దుమ్ము దులిపేసింది. అక్కడ కూడా ఫస్ట్ డే 1 మిలియన్‌ డాలర్స్‌కి పైగా వసూళ్లు రాబట్టి అదరగొట్టేసింది. ఇక ఫస్ట్ రోజు రెస్పాన్స్‌తో యూత్ అంతా థియేటర్లకు పరుగులు తీశారు. అదీగాక ఈ వీకెండ్ అంటే శనివారం, ఆదివారం కలిసి వచ్చింది.

ఇక ఫస్ట్ డే బాక్సాఫీసు వద్ద అబ్బురపరచిన ఈ చిత్రం ఇప్పుడు రెండో రోజు కూడా తన హవా చూపించింది. దీంతో ఈ మూవీ రెండు రోజుల్లో భారీ గ్రాస్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరచింది. రెండు రోజుల్లో ఏకంగా రూ.45.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దుమ్ము దులిపేసింది. ఇంకా బాక్సాఫీసు వద్ద తన హవా చూపిస్తోంది. దీని బట్టి చూస్తే టిల్లు గాని డీజే బాక్సాఫీసు వద్ద బాగా సౌండ్ వస్తుందనే చెప్పాలి.

https://twitter.com/vamsikaka/status/1774292017046286698

ఇక రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి మొత్తంగా రూ.28 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా మరికొద్ది రోజుల్లో మరింత వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×