E-Paper
Advertisement

Sandeep Reddy Vanga: ‘యానిమల్’ తమిళ్‌లో ఆ స్టార్ హీరో చేస్తే బాగా సెట్ అయ్యేది: దర్శకుడు వంగా!

Sandeep Reddy Vanga: ‘యానిమల్’ తమిళ్‌లో ఆ స్టార్ హీరో చేస్తే బాగా సెట్ అయ్యేది: దర్శకుడు వంగా!
Advertisement

Sandeep Reddy Vanga ‘Animal Park’:‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ మూవీతో యూత్‌‌కి బాగా కనెక్ట్ అయిపోయాడు. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. దీని తర్వాత వంగా బాలీవుడ్‌లో ‘యానిమల్’ తెరకెక్కించాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ త్రిప్తి డిమ్రి కీలక పాత్ర పోషించింది.

ఈ మూవీ గతేడాది రిలీజ్ అయి బాక్సాఫీసును షేక్ చేసింది. ఎవరూ ఊహించని కలెక్షన్లను నమోదు చేసి అబ్బుర పరచింది. ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అదరగొట్టేసింది. ముఖ్యంగా ఇందులో ఉండే రొమాంటిక్ సీన్లకు యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు. ఇక ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్‌ను అందుకుంది.

Advertisement

దీంతో ఈ మూవీ సీక్వెల్‌ను కూడా మేకర్స్ ప్రకటించేశారు. ఈ సీక్వెల్‌ చిత్రాన్ని ‘యానిమల్ పార్క్’ పేరుతో తెరకెక్కించనున్నట్లు తెలిపారు. అయితే ఈ యానిమల్ పార్క్ గురించి దర్శకుడు వంగా తాజాగా ఓ అప్డేట్ అందించాడు. వంగా ఇటీవల ఒక అవార్డు వేడుకకు హాజరయ్యాడు. అక్కడ అవార్డును అందుకున్న క్రమంలో యానిమల్ మూవీ సీక్వెల్‌పై కొన్ని అప్డేట్‌లను పంచుకున్నాడు.

Also Read: వాళ్లు అలా చేస్తే హాలీవుడ్‌కి వెళ్లి సినిమాలు తీస్తా: సందీప్ రెడ్డి వంగా

Advertisement

‘యానిమల్ పార్క్’ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా 2026లో సెట్స్‌పైకి వెళ్తుందని అన్నాడు. అయితే యానిమల్ మూవీ కంటే యానిమల్ పార్క్ మరింత వైల్డ్‌గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంతక ముందెన్నడూ లేని విధంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు పేర్కొన్నాడు.

అయితే రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, విజయ్ దేవరకొండ, ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే సందీప్‌ని సినిమాటిక్ యూనివర్స్ గురించి అడగ్గా.. దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదని అతడు చెప్పాడు. అయితే ‘యానిమల్’ మూవీని తమిళ్‌లో తీస్తే సూర్య బాగా సెట్ అయ్యేవాడని తెలిపాడు. దీంతో అతడి వ్యాఖ్యలకు సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇకపోతే వంగా తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చేయనున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×