BigTV English

Sandeep Reddy Vanga: వాళ్లు అలా చేస్తే హాలీవుడ్‌కి వెళ్లి సినిమాలు తీస్తా: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: వాళ్లు అలా చేస్తే హాలీవుడ్‌కి వెళ్లి సినిమాలు తీస్తా: సందీప్ రెడ్డి వంగా
Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga (telugu film news):


ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లు ఎందరో ఉన్నారు. అందులో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు ఇలా చాలామంది ఒకటి రెండు సినిమాలతో తమకంటూ ప్రత్యేక మార్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

అందులో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒకరు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. కేవలం మూడే మూడు సినిమాలతో ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.


టాలీవుడ్‌లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ వంగా.. ఆ తర్వాత తన రెండో సినిమాగా ‘కబీర్ సింగ్’‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అయితే తన కెరీర్‌లో మూడో సినిమాను కూడా బాలీవుడ్‌లోనే తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

READ MORE: షారుఖ్ ఖాన్‌తో తప్పకుండా సినిమా చేస్తా: సందీప్ రెడ్డి వంగా

రణ్‌బీర్ కపూర్‌తో తన మూడో సినిమాగా ‘యానిమల్’ తెరకెక్కించాడు. ఈ మూవీలో మితిమీరిన వైలెన్స్ ఉందని.. మహిళలపై హింసను ప్రోత్సహించారని ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే అలా విమర్శలు చేసిన వాళ్లకి కూడా సందీప్ సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు.

తాజాగా ఆ విమర్శలపై మరోసారి సందీప్ స్పందించారు. తనకు భాషతో సంబంధం లేదని.. తాను కేవలం సినిమాలు చేయాలి అంతే అని అన్నాడు. ఇప్పటికే క్రిటిక్స్ అనేవారు తనపై ఎన్నో విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నాడు.

‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ సినిమాలను ఎంతో మంది ఆదరించారని.. కానీ కొందరు క్రిటిక్స్ ఇలాంటి మూవీలు ప్రేక్షకులపై చెడు ప్రభావాలు చూపిస్తాయని విమర్శిస్తున్నారని అన్నారు. ఇలాగే విమర్శలు చేస్తే తాను హాలీవుడ్‌కి వెళ్లిపోతానని సందీప్ వంగా తాజాగా చెప్పుకొచ్చారు.

READ MORE: ప్రభాస్‌ను ఇంతవరకు అలా చూసుండరు.. గ్యారెంటీ ఇస్తున్నా: సందీప్ రెడ్డి వంగా

ఇకపోతే ఈ మూడు సినిమాలను ఎలాంటి క్రిటిక్స్ ఆపలేకపోయారనే చెప్పాలి. తీసిన ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేశాయి. ఇక ఇటీవల తెరకెక్కించిన యానిమల్ మూవీ దాదాపు రూ.900 కోట్లు వసూళ్లు చేసి అందరినీ అబ్బురపరచింది.

అయితే ఈ మూవీకి ఎన్ని విమర్శలు వచ్చినా.. ఈ మూవీకి సీక్వెల్‌ను తెరకెక్కించాలని సందీప్ డిసైడ్ అయ్యాడు. ‘యానిమల్ పార్క్’ టైటిల్‌తో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. దీనికి సంబంధించిన స్టోరీ అంతా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడది నుంచి స్టార్ట్ కానున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×