BigTV English

B Forms for TDP Candidates: టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు.. 5 స్థానాల్లో అభ్యర్థులు మార్పు!

B Forms for TDP Candidates: టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు.. 5 స్థానాల్లో అభ్యర్థులు మార్పు!

Chandra babu issued B Forms to Elections Candidates: పసుపు పండగ మొదలైంది. బీ ఫారాల పంపిణీ నేపథ్యంలో.. చంద్రబాబు నివాసానికి టీడీపీ నేతలు క్యూ కట్టడంతో.. కరకట్ట మొత్తం పసుపు రంగు పులుముకుంది.


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫారాలను అందజేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో ముందుగా లోక్ సభ అభ్యర్థులకు బీ ఫారంలను అందించారు. మొత్తం 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ అభ్యర్థులకు బీ ఫారం లను అందజేశారు. అనంతరం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు.

కాగా.. బీ ఫారంల పంపిణీకి ముందుగానే.. ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది టీడీపీ. ఉండి ఎమ్మెల్యే టికెట్ ను రఘురామకు కేటాయించగా.. పాడేరు టికెట్ ను మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కేటాయించింది అధిష్ఠానం. అలాగే మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణ మూర్తికి, ఎంఎస్ రాజుకు మడకశిర టికెట్ ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వెంకటగిరి నుంచి కురుగుండ్ల రామకృష్ణను బరిలోకి దింపింది.


Also Read: రాష్ట్రంలో పేదరికాన్ని లేకుండా చేయడమే నా జీవిత ఆశయం: చంద్రబాబు

మరోవైపు అనపర్తి టికెట్ పై చిక్కుముడి వీడింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి.. ఆ పార్టీనుంచి పోటీ చేసేలా అంగీకారం తెలిపారు. దీంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×