Game Changer First Review :గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara advani)తాజాగా నటించిన చిత్రం గేమ్ ఛేంజర్(Game Changer). డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. అలా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన తెలుగు, తమిళ్,హిందీ భాషలలో విడుదల కాబోతోంది. తాజాగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సుకుమార్(Sukumar)చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ముఖ్యంగా ‘పుష్ప2’ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని, మంచి జోరు మీద ఉన్న సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని రాంచరణ్ తో చేయడానికి సిద్ధం అవుతున్నారు.
సినిమా రివ్యూ ఇచ్చేసిన సుకుమార్..
RC 17 అనే వర్కింగ్ టైటిల్ తో సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది. ఈ సినిమా మొదలు కావడానికి మరో ఏడాది సమయం పట్టొచ్చు అని సమాచారం. ఎందుకంటే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా తరువాత బుచ్చిబాబు సనా(Bucchibabu sana) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ సినిమా గురించి తన మొదటి రివ్యూ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.
గూస్ బంప్స్ గ్యారెంటీ..
సుకుమార్ మాట్లాడుతూ.. “ఈ సినిమాను నేను ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో కలిసి చూసాను. మొదటి ఆఫ్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది. మూవీ క్లైమాక్స్ లో అయితే రామ్ చరణ్ అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ చేశారు” అంటూ సినిమాపై అలాగే రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు సుకుమార్. ఇకపోతే కచ్చితంగా ఈ సినిమా సంక్రాంతికి ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుందని తన అభిప్రాయంగా తెలిపారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలిపారు సుకుమార్
టెన్షన్ లో అభిమానులు..
ఇదిలా ఉండగా కమలహాసన్ (Kamalhassan) తో ఇండియన్ -2 సినిమా చేశారు డైరెక్టర్ శంకర్. అయితే ఈ సినిమా ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో అటు మెగా అభిమానులలో కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్ -2 లాంటి డిజాస్టర్ తర్వాత శంకర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రతి ఒక్కరు టెన్షన్ పడుతున్నారు. అయితే సోషల్ డ్రామా ని తెరపై ఆవిష్కరించడంలో శంకర్ ఎక్స్పర్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జెంటిల్మెన్, ఒకే ఒక్కడు వంటి ఎవర్గ్రీన్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఈ చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా ఉండబోతోంది. ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా , పొలిటికల్ లీడర్ గా రెండు విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. తండ్రీ కొడుకులు గా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి.